సుబ్బారెడ్డి, బొత్సాకు కీలక బాధ్యతల కేటాయింపు- రంగంలోకి సాయిరెడ్డి..!!
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్య నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు. కీలక జిల్లాల బాధ్యత లను చూస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాలకు టీటీడీ వైవి సుబ్బారెడ్డికి కేటాయించగా, ఇప్పుడు కుదించారు. మంత్రి బొత్సాకు మరో ముఖ్య జిల్లా బాధ్యతలను అప్పగించారు. మరిన్ని నిర్ణయాల దిశగా సీఎం కసరత్తు చేస్తున్నారు.
సీఎం జగన్ కీలక నిర్ణయాలు:ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదంతో పని చేస్తున్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ, ప్రభుత్వం పరంగా అవసరమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ముందుగా కీలకమైన ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతల్లో మార్పులు చేసారు. ఇప్పటి వరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా న్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు విజయనగరం, అనకాపల్లి, విశాఖ జిల్లా లతోపాటు అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని అరకు, పాడేరు శాసనసభ స్థానాలకు సమన్వయకర్తగా సుబ్బారెడ్డిని నియమించారు. ఈ మేరకు సీఎం జగన్ తన నిర్ణయం ప్రకటించారు.

ఉత్తరాంధ్ర ఇద్దరు నేతలకు అప్పగింత:మంత్రి బొత్సాకు ఉత్తరాంధ్రలోనే పార్టీ బాధ్యతలను అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ శాసనసభ స్థానాలకు పార్టీ ప్రాంతీయ సమ న్వయకర్తగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇటు పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి కీలక జిల్లా బాధ్యతలు స్వీకరించారు.
ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు. ప్రకాశం జిల్లాలో పెత్తనం కోసం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. దీంతో విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం తెరపైకి తెచ్చింది.
రంగంలోకి విజయ సాయిరెడ్డి:తాజాగా బాలినేని నివాసానికి వెళ్లిన విజయ సాయిరెడ్డి సుదీర్ఘ మంతనాలు చేసారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గరయ్యారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంది. దీంతో, ట్రబుల్ షూటర్ విజయ సాయి రెడ్డికి ఆ జిల్లా బాధ్యతలు అప్పగించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నెల్లూరు రూరల్ పార్టీ ఇంఛార్జ్ గా ప్రకటించింది. అక్కడ వైసీపీ నుంచి ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డి ఇంఛార్జ్ గా ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ వర్సస్ వైసీపీకి నెల్లూరు జిల్లా ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ప్రకాశం తో పాటుగా పల్నాడు జిల్లాలోనూ రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు తప్పేలా లేదు. ఈ సమయంలో సాయిరెడ్డికి అక్కడ పార్టీ బాధ్యతలు అప్పగించారు.












Click it and Unblock the Notifications