విశాఖ "హోదా" పెంపు, ప్రభుత్వం కీలక నిర్ణయం- ఇక అధికారికంగా..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ దసరా నుంచి పాలన ప్రారంభిస్తారని సమాచారం. వారంలో మూడు రోజులు అక్కడే ఉంటారని తెలుస్తోంది. ఇదే సమయంలో విశాఖ హోదా పెరిగేలా తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖ పరిపాలనా రాజధాని..పాలన పైన ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
ప్రభుత్వం తాజా నిర్ణయం:ఎన్నికలు సమీపిస్తున్న వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మూడు రాజధానుల వ్యవహరంలో సుప్రీంలో ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. అయితే, విశాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్ తన పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సిద్దమయ్యారు.

గతంలోనే ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. దసరా నుంచి ముఖ్యమంత్రి జగన్ ఇక వారంలో మూడు రోజులు విశాఖ నుంచే పాలన సాగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో విశాఖకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం తాజా ఇచ్చిన ఉత్తర్వులు చర్చకు కారణమయ్యాయి.
సీపీగా అదనపు డీజీ అధికారి:ఏపీ ప్రభుత్వం తాజాగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో విశాఖ నగర కమిషనర్ గా ఉన్న త్రివిక్రమ్ వర్మను తప్పించారు. ఆయన స్థానంలో సీనియర్ అడిషనల్ డీజీపీ ర్యాంకు కలిగి, మరికొద్ది నెలల్లో డీజీగా పదోన్నతి పొందనున్న రవిశంకర్ అయ్యన్నార్ ను ప్రభుత్వం విశాఖ నూతన సీపీగా నియమించింది. తాజా నియామకంలోనే విశాఖ పోలీసు కమిషనరేట్ ను అప్ గ్రేడ్ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో విజయవాడ పోలీసు కమిషన్ హోదాను అప్పటి వరకు డీఐజీ హోా నుంచి అదనపు డీజీ హోదా కల్పించి కమిషనరేట్ చేసింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఐజీ హోదా అధికారి విశాఖ సీపీగా కొనసాగుతున్న సమయంలో అదనపు డీజీ హోదా అధికారిని నియమించటం ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

విశాఖ నుంచి సీఎం పాలన:విశాఖను పరిపాలనా రాజధాని చేసే క్రమంలో లా అండ్ ఆర్డర్ విభాగంలో ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కొద్ది రోజుల క్రితమే విశాఖ కమిషనరేట్ మొత్తాన్ని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది.
త్వరలో ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి తన అధికారిక కార్యకలాపాలు ప్రారంభించే వేళ..ప్రభుత్వం ఇప్పటి విశాఖ సీపీ హోదా అప్ గ్రేడ్ చేసినట్లు ఈ తాజా నిర్ణయంతో స్పష్టం అవుతోంది. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు..పాలనా వ్యవహారాల పర్యవేక్షణ పైన ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications