నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!!
ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు ఉద్యోగాల నియామకాల్లో అభ్యర్ధుల అభ్యర్ధనకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. వయో పరిమితిని సడలించాలని అభ్యర్ధులు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని రెండేళ్లకు పొడిగిస్తూ నిర్ణయించారు.ఈ మేరకు నోటిఫికేషన్ లో వయోపరిమితికి సంబంధించి మార్పులు చేయాలని ఆదేశించారు.
ఈ ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు ఉద్యోగాల నియమానికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఈ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. భర్తీ సమయంలో నిర్ణయించిన వయో పరిమితి సడలించాలని కోరుతూ పలువురు ప్రభుత్వానికి వినతులు పంపారు. దీనిని అధికారులు సీఎం తో చర్చించారు. ముఖ్యమంత్రి రెండేళ్ల పాటు వయోపరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కు సంబంధించి ఈ నిర్ణయం వర్తిస్తుంది.

ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో 6,511 ఉద్యోగాల భర్తీ విధివిధానాలు ప్రకటించారు. అందులో ఎస్‌ఐ, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఏపీఎస్‌పీ రిజర్వ్ సబ్‌ఇన్స్‌పెక్టర్ పోలీసు నియమకాలకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఎస్‌ఐ పోస్టులు 411, కానిస్టేబుల్ పోస్టులు 6,100 వరకు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికీ పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. నియమకాలకు డిసెంబర్ 28, జనవరి 18 తేదీల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పుడు రెండేళ్ల వయో పరిమితి సడలింపుతో పెద్ద సంఖ్య లో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కలగనుంది.












Click it and Unblock the Notifications