సీఎం జగన్ ఆపరేషన్ నగరి - రోజాకు టర్న్ అయ్యేనా..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. కూటమి బలంగా ఉన్నినియోజకవర్గాల పైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. మంత్రి రోజా పోటీ చేస్తున్న నగరి నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ లెక్కలు వేగంగా మారుతున్నాయి. దీంతో..నగరి పైన జగన తాజాగా ఫోకస్ చేసారు. సొంత పార్టీ నేతలు రోజాకు వ్యతిరేకంగా మారటంపై ఆరా తీసారు. కొత్త రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసారు.
రోజాకు వ్యతిరేకంగా
నగరి నియోజకవర్గంలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. రోజాకు మంత్రి రోజాకు ఆమె సొంత నియోజకవర్గం నగరిలోనే అసమ్మతి సెగ తగులుతోంది. ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రమవుతోంది. వ్యతిరేకవర్గం ఇప్పుడు వైసీపీని వీడుతుండడం వైసీపీ కేడర్ లో గందరగోళం నెలకొంది. రోజాను ఇబ్బంది పెట్టిన ఐదుగురు అసమ్మతి నేతల్లో నలుగురు తెలుగుదేశం పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు నేతలు పార్టీ వీడేందుకు రెఢి అవుతుండటంతో కీలక సమయంలో రోజాను కలవరపెడుతోంది.

సొంత పార్టీ అసమ్మతి
మంత్రి రోజాకు వ్యతిరేకంగా 5 మండలాల్లోని 5 మంది నేతలు ఒక్కటిగా ఇప్పటిదాకా రాజకీయం చేస్తూ వచ్చారు. వైసీపీలోనే ఉంటూ ఆమెను వ్యతిరేకిస్తూ వచ్చిన అసమ్మతి వర్గం, రోజాకు టికెట్ దక్కకుండా అన్ని ప్రయత్నాలు చేసింది. రోజాకు టికెట్ ఇస్తే పని చేయమని అల్టిమేటం కూడా జారీ చేసింది. స్వయాన సీఎం జగన్ జోక్యం చేసుకున్న నగరి పంచాయతీ తేలకపోయింది. పుత్తూరుకు చెందిన ఏలుమలై, వడమాలపేట మండలానికి చెందిన జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, నిండ్ర మండలానికి చెందిన శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్ట్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతి రాజు ఇలా నలుగురు టీడీపీ గూటికి చేరువయ్యారు.

జగన్ జోక్యంతో సెట్ అయ్యేనా
ఇక నగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి ఆమె భర్త కేజే కుమార్ మాత్రమే. కాగా వీళ్లు కూడా రోజా ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉంటున్నారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ నగరి పరిస్థితుల పైన ఆరా తీసారు. స్థానికంగా వ్యతిరేకత వచ్చినా రోజా గెలుస్తారనే నమ్మకంతో జగన్ సీటు ఇచ్చారు. మరో వారంలో పోలింగ్ జరగనుండటంతో జిల్లా ముఖ్యలతో నగరి పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. జగన్ నగరిలో ప్రచారానికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న నేతలతో పార్టీ ముఖ్యులు మాట్లాడినట్లు తెలుస్తోంది. రోజాకు కీలక దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో.. జగన్ జోక్యంతో రోజాకు నగరిలో పరిస్థితులు అనుకూలిస్తాయా..ఫలితం ఎలా ఉంటుదనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications