• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారసులకు టికెట్లపై తేల్చేసిన సీఎం జగన్ : తాజా - మాజీ మంత్రులకు క్లారిటీ..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు తన టీం సిద్దం చేసుకుంటున్నారు. ఎటువంటి మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ వారసులను ప్రమోట్ చేయాలనుకుంటున్న నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు ఇంకా 19 నెలల సమయం మాత్రమే ఉందని చెబుతూ పార్టీ ఎమ్మెల్యేలకు రూట్ మ్యాప్ ఫిక్స్ చేసారు. 27 మంది మంత్రులు- ఎమ్మెల్యేల పని తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వారికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ లోగా పని తీరు మెరుగుపర్చుకోవాల ని నిర్దేశించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తానని ప్రకటించారు. పని తీరు మెరుగు పర్చుకోని వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

మీ బిడ్డలను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే

మీ బిడ్డలను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే

పని తీరు సరిగా లేని వారి పైన అభిమానం ఉన్నా, పార్టీ ప్రతీ స్థానంలో గెలుపు ముఖ్యమని స్పష్టం చేసారు. టికెట్లు ఇవ్వలేని వారికి మరో విధంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కొందరు తమ కుటుంబ సభ్యుల ను ప్రమోట్ చేస్తున్నారంటూ వారసుల అంశం పైన సీఎం రియాక్ట్ అయ్యారు. కొంత మంది తాము తిరగకుడా తమ వారసులు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారని చెబుతున్నారని, అవి కుదరవని సీఎం తేల్చి చెప్పారు. మీ బిడ్డలను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కానీ, ఎన్నికల్లో మాత్రం మీరే ఈ సారి పోటీ చేయాలంటూ సీఎం చాలా క్లియర్ గా చెప్పారు. మీతో ర్యాపో, అనుబంధం ఉంది. ఈ సారికి మీరే పోటీ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

వారసులు కాదు - మీరే పోటీ చేయాలి

వారసులు కాదు - మీరే పోటీ చేయాలి

ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్.. మాజీ మంత్రి పేర్ని నాని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారని సీఎం పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు. ఆ సమయంలోనే పేర్ని నాని తాను పార్టీ కోసం పూర్తి సమయం కేటాయిస్తున్నానని, ఎన్నికల్లో మాత్రం తన కుమారుడు పోటీ చేస్తారంటూ చెప్పే ప్రయత్నం చేసారు. దీనికి సీఎం అందరి సమక్షంలోనే క్లారిటీ ఇచ్చారు. ఈ సారి మీ ఇద్దరూ పోటీ చేయాల్సిందే, నాతో మీరిద్దరూ ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా చెప్పారు. పేర్ని నాని ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుండగా, లేదు..నీవే పోటీ చేస్తున్నావు అంటూ సీఎం చెప్పటంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. అయితే, ఇప్పుడు వారసులకు టికెట్ల విషయంలో ఈ ఇద్దరి వరకే సీఎం నిర్ణయం పరిమితం అవుతుందా లేక, తమ వారసులను ప్రమోట్ చేస్తున్న ఇతర సీనియర్లకు ఇదే నిర్ణయం వర్తిస్తుందా అనేది ఇప్పుడు పార్టీలో చర్చకు కారణమైంది.

ఆ ఇద్దరికేనా - అందరికీ ఇదే వర్తిస్తుందా

ఆ ఇద్దరికేనా - అందరికీ ఇదే వర్తిస్తుందా

ఆర్దిక మంత్రిగా ఉంటూ నియోజకవర్గంలో తిరగకపోతే ఎలా అంటూ సీఎం జగన్ మంత్రి బుగ్గనను ప్రశ్నించారు. తిరగాలి కదా అంటూ వ్యాఖ్యానించారు. ఎక్కడైతే పార్టీ నేతలు ఇంటింటికి గడప నిర్వహిస్తున్నారో ఆ గ్రామంలో పార్టీ నేతల ఇంట్లో భోజనం చేయాలని సూచించారు. ఇంటింటికి గడప వర్క్ షాపు మరోసారి డిసెంబర్ 4న నిర్వహిస్తానని సీఎం స్పష్టం చేసారు. ఇప్పుడు 27 మంది పని తీరు మార్చుకోవాలని, మరోసారి పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పారు. మీరంతా తిరిగి తనతో కలిసి పని చేయాలనే ఉద్దేశంతోనే పదే పదే నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులను వివరిస్తూ అలర్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్.. తప్పనిసరి పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసారు. అయితే, పలువురు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉండటం.. రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో వారిలో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.

English summary
CM Jagan given Clarity on Successors contest in up coming elections in party works Shop, CM says Buggana and Perni Nani to be in race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X