వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరూ ఒకే మాట చెప్పాలి: మండలిలో ఇలా చేద్దాం: ముఖ్య నేతలకు జగన్‌ నిర్దేశం..!

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానుల అంశం..విశాఖలో పరిపాలనా రాజధాని దిశగా నిర్ణయానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు ఈ వ్యహారం ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. వైసీపీ మూడు రాజధానులకు మద్దతు గా ఉంటే.. మిగిలిన అన్ని పార్టీలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సభలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం పైన వ్యక్తిగతంగా పరిశీలన చేస్తున్నారు. కీలక నేతలతో సీఎం సమావేశమయ్యారు. సభలో ఏ రకంగా వ్యవహారించాలనే దాని పైన దిశా నిర్దేశం చేసారు. సభలో బిల్లు ప్రవేశ పెట్టిన తరువాత కార్యక్రమాలు జరగకుండా టీడీపీ గందరగోళానికి దిగితే ఏం చేయాలనే దాని పైనా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇక, మండలిలో టీడీపీకి సంఖ్యా పరంగా బలం ఉండటంతో అక్కడ అనుసరించాల్సిన వ్యూహం పైన నిర్ణయానికి వచ్చారు. దీంతో.. వైసీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు రెండు సభల్లో ఎవరు ఏం మాట్లాడినా..ఒకటే మాటగా ఉండాలంటూ సీఎం జగన్ స్పష్టం చేసారు.

మూడు ప్రాంతాల నేతలు..ఒకటే మాట..
అసెంబ్లీలో మూడు రాజధానుల పైన..మూడు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఒకే మాట మాట్లాడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రాజధాని మార్పుపై ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల వాళ్లూ స్వాగతిస్తున్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడేలా చూడాలని పార్టీ ముఖ్య నేతలకు ముఖ్యమంత్రి సూచించారు. సభలో ఈ బిల్లు సమయంలో అనుసరించాల్సిన వ్యూహం పైనా సీఎం జగన్ పార్టీ సీనియర్‌ నేతలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. అమరావతి నుంచి సచివాలయం, హైకోర్టు తరలింపునకు అన్ని ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలనూ చర్చలో భాగస్వాములను చేయాలని.. తద్వారా రాష్ట్ర గొంతుకను వినిపించినట్లు అవుతుందని జగన్‌ పేర్కొన్నట్లు తెలిసింది. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపిచ్చిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఆంక్షలు అమలు చేయడం సహా.. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఆయన సమీక్షించారు.

 CM Jagan key istructions to ministers and aprty leaders on strategy to follow in Assembly

సమన్వయం చాలా ముఖ్యం..
ఇది ప్రభుత్వానికి కీలక సమయమని..మంత్రులు..పార్టీ నేతల మధ్మ సమన్వంలో ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలని సీఉం నిర్ధేశించారు. సభలో వ్యూహం పైనా ..శాసనసభలో పార్టీలో అంతర్గత సమన్వయంపైనా చర్చించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో సీఎం సమీక్ష జరిపారు. తొలి రోజు శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టాలని..టీడీపీ ఆందోళనకు దిగి..సభా కార్యకలాపాలకు అడ్డుకుంటే ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా ఈ భేటీలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక, మండలిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండటంతో..అక్కడ అనుసరించాల్సిన వ్యూహం పైన ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిలో భాగంగానే మూడు రోజుల సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో..సభలో ఏ విధంగా అయినా బిల్లును ఆమోదించేలా ప్రభుత్వం..అడ్డుకుంటామంటూ ప్రతిపక్షం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో..సభా కార్యక్రమాల పైన ఆసక్తి నెలకొని ఉంది.

English summary
CM Jagan key istructions to ministers and aprty leaders on strategy to follow in Assembly. Cm saying that all malas form three areas to be stand on single line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X