చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది- పొడవటం ఖాయం : సీఎం జగన్..!!

ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో పై సెటైర్లు వేసారు. ఆయన మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ ఎదురెదురుగా తలబడి అక్కడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని చంద్రబాబు కలిపేసి ఒక బిస్మిల్లా బాత్‌ వండేశాడని ఎద్దేవా చేసారు. ఏడాడు మాట మీద నిలబడని చంద్రబాబు ఆకర్షణీయమైన మేనిఫెస్టో అంటూ మరోసారి ప్రజలను వెన్నుపోటు పొడవటానికి వచ్చారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.

చంద్రబాబు పై సెటైర్లు : ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించారు. అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 2023-24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం విడుదల చేసారు. సభలో టీడీపీ మేనిఫెస్టో పైన మండిపడ్డారు. రాజమండ్రి మహానాడు పేరుతో డ్రామా నడిచిందని చెప్పుకొచ్చారు. వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని పురుషుడు, శక పురుషుడు, రాముడు అని, కృష్ణుడు అని కీర్తిస్తూ అదే మనిషి పోటోకు దండేస్తారని విమర్శించారు.

jaganchandrababunaidu-

మేనిఫెస్టో కాపీ కొట్టారు : చంద్రబాబు తీరును సీఎం జగన్ తప్పు బట్టారు. చంద్రబాబు ప్రతీ ఎన్నికకు ఒక వేషం వేస్తారన్నారు. నిజం చెప్పరని..ధర్మానికి కట్టుబడని మండిపడ్డారు. మాట మీద నిలబడరన్నారు. విలువలు, విశ్వసనీయత అసలే లేవు. ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు క్యారెక్టర్‌ అని చెప్పుకొచ్చారు. అధికారం కోసం ఎవరినైనా పొడవడానికి ఏ మాత్రం కూడా వెనుకాడనిది చంద్రబాబు క్యారెక్టర్‌ అని విమర్శించారు.

ప్రజల కష్టాల నడుమ, వాటి పరిష్కార దిశగా, ప్రజల ఆశలు, ఆకాంక్షల నడుమ, ప్రజల గుండె చప్పుడుగా వైసీపీ మేనిఫెస్టో పుట్టిందని వివరించారు. చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ ఎదురెదురుగా తలబడి అక్కడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని చంద్రబాబు కలిపేసి ఒక బిస్మిల్లా బాత్‌ వండేశారని ఎద్దేవా చేసారు. మన అన్నీ కూడా కాపీ కొట్టేసి ఇంకో పులిహోరా వండేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు ఒరిజినాలిటీ లేదు. పర్సనాలిటీ లేదు. క్యారెక్టర్‌ లేదు. క్రిడిబులిటీ అంతకన్నా లేదన్నారు.

ys-jagan-cbn

టీడీపీకి అభ్యర్దులు లేరు : టీడీపీకి పోటీ చేసేందుకు ఈ పెద్ద మనిషికి 175 నియోజకవర్గాల్లో 175 మంది క్యాండెట్లు కూడా లేరని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 1995 లో సీఎం అయిన వ్యక్తి ప్రజలకు చేసిన మంచి పనులు గురించి వివరించి ఓట్లు అడగిగే అవకాశం లేక ఇంకోఛాన్స్‌ఇవ్వండి చేసేస్తానని అడుగుతున్నారని ఎద్దేవా చేసారు. అందరినీ నమ్మించి మోసం చేయటం చంద్రబాబుకు అలవాటు అయిందని ఆరోపించారు.

చంద్రబాబు మొదటి సంతకాలనే మోసంగా, వంచనగా, దగాగా మార్చారని మండిపడ్డారు. మరోసారి మళ్లీ కొత్త వాగ్ధానాలతో జనం ముందుకు వస్తున్నారని అప్రమత్తం చేసారు. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఒక యుద్ధం జరుగబోతోంద న్నారు. ఈ కురుక్షేత్రంలో చంద్రబాబు పెత్తందారి భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+