కూటమి నేతల ఆశలపై జగన్ నీళ్లు - చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్..!!
ఏపీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. గెలుపు కోసం అటుకుటని ఇటు వైసిపి హోరాహోరీగా తలపడుతున్నాయి. మరో రెండు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. టిడిపి, కూటమి ముఖ్య నేతల నియోజకవర్గాల పై గుడిపెట్టారు. మంత్రి రోజాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నారు. మంగళగిరి, పిఠాపురంలో కొత్త స్కెచ్ తో జగన్ అడుగులు వేస్తున్నారు.
జగన్ కీలక నిర్ణయం
ఈనెల 11వ తేదీ సాయంత్రం తో ఏపీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ దశలో ముఖ్యమంత్రి జగన్ చివరి మూడు రోజుల ప్రచారంలో కీలక మార్పులు జరిగాయి. టిడిపి కంచుకోటగా భావిస్తున్న నియోజకవర్గాల పైన ఫోకస్ చేశారు. ఈరోజు కర్నూలు, కళ్యాణ్ దుర్గం, రాజంపేట నియోజకవర్గాల్లో జగన్ ప్రచార సభలు జరగనున్నాయి.

రేపు శుక్రవారం టిడిపి నేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం లో భారీ సభకు వైసిపి నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. మంగళగిరి నుంచి గెలుస్తానని లోకేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ వైసిపి నుంచి చేనేత వర్గానికి చెందిన లావణ్యను జగన్ బరిలోకి దింపారు. మంగళగిరి లో జరిగే సభలో పొరుగు నియోజకవర్గాలైన తాడికొండ, పత్తిపాడు సంబంధించి ప్రచారం చేయనున్నారు.
చివరి రెండు రోజులు ఇలా
మంగళగిరి నియోజకవర్గం బీసీలదిగా జగన్ ప్రచారం చేస్తున్నారు. బస్సు యాత్ర సమయంలో మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన వారితో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలోనే నాన్ లోకల్ వ్యక్తులకు మద్దతు ఇవ్వవద్దని పిలుపునిచ్చారు. చంద్రబాబు మంగళగిరిలో తన కుమారుడిని డబ్బులతో గెలిపించాలని చూస్తున్నారని ఆరోపించారు. టిడిపి ఇచ్చే డబ్బులు తీసుకోవాలని కానీ స్థానికంగా ఉన్న బిసి మహిళా అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు.
చేనేత వర్గానికి తన ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరిస్తూ.. తన సంక్షేమ ఓట్ బ్యాంక్ మంగళగిరిలో అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో నగరిలో మంత్రి రోజా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.

జగన్ సీన్ మార్చేస్తారా
దీంతో రోజా గెలుపు కోసం ముఖ్యమంత్రి జగన్ నగరిలో ప్రచారానికి నిర్ణయించారు. అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నేతలతోనూ సమీక్ష ఏర్పాటు చేశారు. ఇక ఈనెల 11న ప్రచారానికి చివరి రోజు కావడంతో అదే రోజున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో భారీ బహిరంగ సభతో తన ఎన్నికల ప్రచారం ముగించేలా జగన్ సిద్ధమవుతున్నారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. అక్కడ వైసిపి అభ్యర్థి వంగా గీత పోటీలో ఉన్నారు. పిఠాపురం నుంచి రాష్ట్ర ప్రజలకు జగన్ ఎన్నికల సమయంలో కీలక సందేశం ఇవ్వనన్నారు. ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో జగన్ చివరి రెండు రోజుల పర్యటన పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతుంది.












Click it and Unblock the Notifications