ఫలితాలపై జగన్ తాజా అంచనాలేంటి - అనూహ్యంగా..!!
ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ప్రచారానికి కొద్ది గంటలే సమయం ఉంది. ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు, పవన్ ఈ రెండు రోజులు పూర్తిగా ప్రజల్లోనే ఉంటున్నారు. ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యంతో కొత్త వ్యూహాలతో సిద్ధమయ్యారు. వై నాట్ 175 అంటున్న జగన్ తాజాగా ఎన్నికల ఫలితాలపై తన తన అంచనాలపై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. దీంతో, ఎన్నికల రాజకీయం మరింత ఉత్కంఠ పెంచుతోంది.
జగన్ కసరత్తు
2024 ఎన్నికల కోసం ముఖ్యమంత్రి జగన్ చాలాకాలంగా కసరత్తు చేస్తున్నారు. వై నాట్ 175 అంటూ పార్టీని అప్రమత్తం చేశారు. చాలా అందించిన సంక్షేమం, సామాజిక న్యాయంతో అన్ని సీట్లలో విజయం సాధించాల్సిందేనని దిశా నిర్దేశం చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో అసలు సమయం వచ్చింది. మరికొద్ది గంటల్లో ప్రచారం ముగిసి.. కౌంటింగ్ ప్రారంభం కానుంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం.. వ్యూహాల పైన జగన్ అప్రమత్తమయ్యారు. ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు ఏంటో ముఖ్య నేతల వద్ద ప్రస్తావిస్తున్నారు. తుది ఫలితం పైన వైసిపి, కూటమిలో ఉత్కంఠ కొనసాగుతోంది.

నిరంతర పర్యవేక్షణ
అన్ని పార్టీలు కలిసి తన ఓటమి కోసం ప్రయత్నిస్తున్న వేళ జగన్ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నిత్యం మూడు ఎన్నికల సభల్లో ప్రచారం చేస్తున్న జగన్..అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం, స్థానిక ప్రజా స్పందన పైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా..సమన్యయం లేకపోయినా పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. పొరపాట్లను సరి చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్దేశిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ముఖ్యమని సీరియస్ గా చెబుతున్నారు. ఈ రెండు రోజులు జగన్ ఆరు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. కూటమి ముఖ్య నేతల నియోజకవర్గాల్లోనూ గెలిచి తీరాల్సిందేనని పార్టీ బాధ్యులకు స్పష్టం చేస్తున్నారు.
గెలుపు, సీట్ల పై ధీమా
ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదం పైనే ఇప్పటికే నమ్మకంతోనే ఉన్నారు. పలు సర్వే సంస్థలు, నిఘా నివేదికల ఆధారంగా అవసరమైన వ్యూహ రచన చేస్తున్నారు. ప్రచారంకు మిగిలి ఉన్న సమయం సద్వినియోగం చేసుకోవటంతో పాటుగా..పోలింగ్ ముందు రోజు చోటు చేసుకొనే పరిణామాల పైన అప్రమత్తంగా ఉండాలని నిర్దేశిస్తున్నారు. వై నాట్ 175 సాధ్యమా అనే చర్చ వేళ.. జగన్ సన్నిహితులు మాత్రం ముఖ్యమంత్రి ధీమా గురించి ప్రస్తావిస్తున్నారు. కూటమి నేతలు మైండ్ గేమ్ మొదలు పెట్టాయని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో ముందుకు వెళ్తున్నాయని విశ్లేషిస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం వైసీపీకి అనుకూలం గా ఉందని..తుది ఫలితం తమకే విజయం అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications