రఘురామ పై వైసీపీ అభ్యర్ది ఫిక్స్ - జగన్ కొత్త స్కెచ్..!!

ఏపీలో ఎన్నికల పోరు ముఖ్య నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. జగన్ ఓటమే లక్ష్యంగా మూడు పార్టీల కూటమి నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇటు జగన్ తిరిగి అధికారం ఖాయమనే ధీమాతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనూ మూడు పార్టీల ముఖ్య నేతలను ఓడించాలనే లక్ష్యంతో అభ్యర్దుల విషయంలో జగన్ అవసరమైన మార్పులు చేస్తున్నార. ఇప్పుడు రఘురామ అంశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రఘురామ పై వైసీపీ అభ్యర్ది
తాజాగా టీడీపీలో చేరిన రఘురామ రాజు పోటీ స్థానం పైన అధికారికంగా స్పష్టత రాలేదు. రఘురామ ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయటం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ అభ్యర్దిగా ప్రకటించిన రామరాజుక పార్టీ నేతల నుంచి సమాచారం అందుతోంది. రామరాజుకు కాదని అభ్యర్దిని మార్చటం పైన రామరాజు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, మరి కొంత సమయం తీసుకొని ప్రకటించేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ ను కలిసిన రఘురామ రాజు తన నియోజకవర్గంలో పర్యటనకు రావాలని ఆహ్వానించారు. ఇటు రఘురామ పోటీ చేసే నియోజకవర్గంలో ధీటైన అభ్యర్ది కోసం జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

CM Jagan likely to field ex minister against Raghu Rama Raju form Undi Assebly Constituency

జగన్ ఛాయిస్ ఎవరు
నర్సాపురం స్థానం బీజేపీ నుంచి రఘురామకు తిరిగి దక్కే అవకాశం లేదు. దీంతో, రఘురామ ఉండి నుంచి బరిలో నిలవటం దాదాపు ఖాయమైంది. వైసీపీ నుంచి ఉండి అభ్యర్దిగా పీవీఎల్ నర్సింహరాజు ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 71, 781 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి గెలిచిన మంతెన రామరాజుకు 82, 730 ఓట్లు దక్కాయి. ప్రస్తుతం ఉండి నుంచి టీడీపీ సీటు దక్కని మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామ రాజు స్వతంత్ర అభ్యర్దిగా బరిలో నిలవాలని భావిస్తున్నారు. సీటు రఘురామకు కేటయిస్తే రామరాజు నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఉండి స్థానం ఏ పార్టీ అయినా క్షత్రియ వర్గానికి కేటాయించాల్సి ఉంది. అయితే, రఘురామ పైన వైసీపీ నుంచి జగన్ నర్సింహ రాజునే కొనసాగిస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారుతోంది. ఇప్పటికే అక్కడ ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ కసరత్తు
ఉండిలో గతంలో నర్సాపురం నుంచి జాతీయ పార్టీ నుంచి ఎంపీ గా గెలిచిన ఒక నేతను బరిలోకి దించేందుకు మంత్రాంగం సాగుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. అదే విధంగా జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మరో నేత పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. అయితే, గతంలో ఎమ్మెల్యేగా గెలిచి సీటు దక్కని మరో నేత వైపు వైసీపీ ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ నెల 12న పార్టీ ఇంఛార్జ్ మిథున్ రెడ్డి ఇక్కడి పరిస్థితుల పైన అభ్యర్ది నర్సింహరాజుతో సహా పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. ఆ సమయంలో పార్టీలో చేరికలు..అభ్యర్ది మార్పు అవసరమా లేదా అవసరమైతే ఎవరిని దించాలనే అంశం పైన ఒక అంచనాకు వచ్చి జగన్ కు నివేదిక ఇవ్వనున్నారు. దీనికి అనుగుణంగా సీఎం జగన్ ప్రస్తుత అభ్యర్దిని కొనసాగించటమా..మార్పు చేస్తే ఎవరిని బరిలోకి దించాలనేది నిర్ణయించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+