మంత్రుల సీట్లలో జగన్ మార్క్ మార్పులు - వారు డౌట్, వీరు ఔట్..!?
వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవటమే సీఎం జగన్ లక్ష్యం. ఇందు కోసం ఇప్పటికే తన పార్టీ శ్రేణులను ప్రజల్లోకి పంపారు. తన సంక్షేమ క్యాలెండర్ పక్కాగా అమలు చేస్తున్నారు. మార్చిలో ఎన్నికల సమరం ఉంటుందని చెప్పిన జగన్..దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్దం చేసారు. ఇదే సమయంలో గెలుపే ప్రామాణికంగా అభ్యర్దుల ఎంపిక పైక కసరత్తు చేస్తున్నారు. దీంతో, ప్రస్తుత మంత్రుల్లో కొందరి సీట్ల మార్పు..మరి కొందరిని లోక్ సభకు పంపటం పైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ సారి ఏ ఒక్క సీటు వదులకొనేందుకు సీఎం జగన్ సిద్దంగా లేరు. సీనియర్ నేత..మంత్రి ఎవరైనా గెలుస్తారనే నమ్మకం ఉంటేనే సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని లోక్ సభకు పంపాలని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు. వీరిలో గుమ్మనూరి జయరాం, ఉషశ్రీ చరణ్, విడదల రజనీ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాధ్, జోగి రమేష్ పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కర్నూలు ఎంపీగా గుమ్మనూరి జయారం పేరు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఉషశ్రీచరణ్ ను ఈ సారి హిందూపురం లోక్ సభకు పంపుతారని చెబుతున్నారు. స్పీకర్ తమ్మినేని..ధర్మాన ప్రసాదరావు లో ఒకరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే విధంగా మరో మంత్రి గుడివాడ అమర్నాధ్ ను అవసరమైతే ఏంపీగా పంపే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సమాచారం.
మరో మంత్రి జోగి రమేష్ ను ఏలూరు లేదా విజయవాడ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపేందుకు సమర్ధమైన అభ్యర్దిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సర్వే ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక. మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, బుగ్గన, అంజాద్ బాషా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, సిదిరి అప్పలరాజు కు సీట్లు ఖాయంగా కనిపిస్తున్నాయి.
బొత్సా, బుగ్గన తమ కుమారులకు సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రి సురేష్ ను ఈ సారి కొండెపి నుంచి పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా కు సీటుపైన సందిగ్ధత ఉన్నా...రోజానే బరిలోకి దింపే అవకాశం ఉంది.
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అదే విధ:గా మేరుగ నాగార్జున వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి నాగార్జునను ప్రకాశం జిల్లా సంతనూతల పాడు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి రాంబాబు సీటు మారుతుందని చెబుతున్నా...ఆయన మాత్రం సత్తెనపల్లి నుంచే పోటీలో ఉంటానని ధీమాగా ఉన్నారు.
గోదావరి జిల్లాల్లోని మంత్రులు కొట్టు సత్యానారయణ, కారుమారి నాగేశ్వర రావు సీట్ల విషయంలో అటు టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా ఖరారు అయ్యే ఆ పార్టీల అభ్యర్దులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రామచంద్రాపురంలో మంత్రి వేణకు సీటు విషయంలో ఎంపీ పిల్లి, ఎమ్మెల్యే తోట వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో..గెలుపు మాత్రమే ప్రామణికంగా సీఎం జగన్ సీట్ల ఖరారు చేయనున్నారు. దీంతో, మంత్రుల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications