వారంతా ఏకం అవుతున్నారు - జరిగేదిదే, సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికలకు కురుక్షేత్ర యుద్దంగా పేర్కొన్నారు. తనను ఎదుర్కోవటానికి వారందరూ కలిసికట్టుగా వస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. తోడేళ్లు ఏకమవుతున్నాయన్నారు. ఈ రోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు..ఈ రోజు పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపు ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందా లేదా అనేది బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలపై ఫైర్:టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారన్నారు. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్‌వార్ జరుగుతోందన్నారు. ఇవాళ కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా జనవరి-ఫిబ్రవరి-మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుందని వివరించారు.

అండగా నిలుస్తా:ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశామని చెప్పారు. జాబ్ ఓరియోంటెడ్‌గా కరిక్యులమ్ మార్చామని... దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టామన్నారు పిల్లల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామన్నామని వివరించారు. నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. పిల్లల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం మైక్రోసాప్ట్ లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్యనాదేళ్ల రావాలని ఆకాంక్షించారు. ప్రతిపక్షాలకు ప్రజల గురించి ఆలోచన లేదని వారి ఆలోచన అంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమనేని ముఖ్యమంత్రి విమర్శించారు.
తోడుగా మీరే సైనికులుగా:గత ప్రభుత్వానికి..ఇప్పటికీ తేడా గమనించాలని ముఖ్యమంత్రి సూచించారు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అని వివరించారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు బటన్ నొక్కి రూ.3 లక్షల కోట్లు నేరుగా జమ చేశామని చెప్పుకొచ్చారు. వారి లాగా తనకు దత్తపుత్రుడు, మీడియా మద్దతు లేదని చెప్పుకొచ్చారు. మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ జగనన్నకు తోడుగా మీరే సైనికులు కండంటూ అభ్యర్ధించారు. తన బలం మీరు, ఈ రోజు తన నమ్మకం మీరు అని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. తాను నమ్మకున్నది దేవుడి దయను, అందరి చల్లని దీవెనలేనని స్పష్టం చేసారు. రాబోయే రోజుల్లో జరుగనున్న కురుక్షేత మహా సంగ్రామంలో మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లకాలం కావాలని ముఖ్యమంత్రి కోరారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications