వీరంతా ఏకమైతే ఎన్నికల్లో జరిగేదిదే : అమరావతిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికల పొత్తులు..ఫలితాల పైన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి పైన సీఎం జగన్ ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. ఈ నెల 26న అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అమరావతిలో సామాజిక అన్యాయం చేసారని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు వద్దని మూడు అన్ని ప్రాంతాలను చంద్రబాబు అవమానించారని మండిపడ్డారు. పెత్తందార్ల వ్యవస్తకు చంద్రబాబు ప్రతీక గా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
పోర్టు పనులకు శంకుస్థాపన : ముఖ్యమంత్రి జగన్ బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేసారు. చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి ఏకమైతే..మంచి చేసిన చరిత్ర ఎన్న మీ బిడ్డ ఎన్నలకల్లో గెలవటమే కష్టమని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మంచి చేసామని చెప్పి ఓట్లు అడితే పరిస్థితి లేద్నారు, కుట్ర,కుతంత్రాలను నమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. వీరంతా ఏకమై ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించగలరన్నారు. ఇప్పటి వరకు రెండు లక్షల 10 వేల కోట్ల మేర పేదలకు మంచి అందించామని వివరించారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే మీరంతా సైనికులుగా మారి అండగా నిలవాలని ముఖ్యమంత్రి కోరారు. చంద్రబాబుకు మానవత్వమే లేకుండా పోయిందన్నారు. పేదలకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అమరావతిలో పేదలకు అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతిపై వ్యాఖ్యలు : బందరు పోర్టు విషయంలో నిర్లక్ష్యం చేసారని ఆరోపించారు. ఇక్కడ పోర్టు రాకపోతే అమరావతికి డిమాండ్ వస్తుందని అంచనా వేసారని వివరించారు. అమరావతిలో సామాజిక అన్యాయం జరిగిందన్నారు. ఈ నెల 26న అమరావతిలో 50 వేల మందికి ఇంటి స్థలాలు ఇస్తున్నామని ప్రకటించారు. తోకలు కత్తిరస్తామని బీసీలను అవమానించిన చంద్రబాబు..పేదలకు స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తుంటే చంద్రబాబు అవమానించేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలను సమాధి కట్టుకొనే స్థలాలతో పోల్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వీరు పేదలకు మంచి చేసామని చెప్పి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. దత్త పుత్రుడిని నమ్ముకుంటారని ఎద్దేవా చేసారు.
వారంతా కలిస్తే ఓడిస్తారట : రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలోని పేదలకు ఏమాత్రం ప్రవేశం లేని ఒక గేటెడ్ కమ్యూనిటిని గవర్నమెంట్ డబ్బుతో కట్టుకోవాలని చుట్టూ ఒక భారీ రియల్ ఎస్టేట్ ద్వారా లక్షల కోట్లు గడించాలని చంద్రబాబు స్కెచ్ వేసారని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సెంట్ భూమి కూడా ఇవ్వలేదన్నారు. ఒక్కరికి కూడా ఇల్లు కట్టించలేదని చెప్పారు పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో కేసులు వేయించారని చెప్పుకొచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీని అతిదారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు అంటూ సీఎం జగన్ మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మంచి జరిగిందా లేదా అనేది గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications