వైసీపీ కొత్త ఇంఛార్జ్ ల్లోనూ మార్పులు - సర్వేలు తేల్చిందేంటి..!?

ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక మలుపులు తీసుకుంటోంది. సీఎం జగన్ అభ్యర్దుల ఎంపికలో కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 ఎంపీ, 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొత్త ఇంఛార్జ్ లను మార్పు చేసారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లోకి వెళ్లాలని కొత్త ఇంఛార్జ్ లకు సూచిస్తున్నారు. జగన్ ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లా పర్యటనలకు సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో తాజా ఇంఛార్జ్ ల్లోనూ అవసరమైతే మరోసారి మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

గెలుపే లక్ష్యంగా: ముఖ్యమంత్రి జగన్ గెలుపే ప్రామణికంగా..సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఇంఛార్జ్ లను మార్పు చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల్లోకి దిగుతున్నాయి. బీజేపీ వైఖరి స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ సైతం ఈ సారి తమ బలం పెంచుకొనే వ్యూహాలు అమలు చేస్తోంది. దీంతో..జగన్ అలర్ట్ అయ్యారు.

CM Jagan making Serious decisions over finalisation of party candidates for next Elections

మొత్తం 175 నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ ల నియామకం తరువాత క్షేత్ర స్థాయి పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. పార్టీ శ్రేణులను కలుపుకువెళ్లటం..పని తీరు..ప్రత్యర్ధి పార్టీల నుంచి అభ్యర్దులు వంటి అంశాల పైన సర్వే నివేదికలను సీఎం జగన్ తెప్పించుకుంటున్నారు. వీటి ఆధారంగా చర్యలకు సిద్దమవుతున్నారు.

జగన్ కీలక అడుగులు: ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లుగానే అభ్యర్దులను పేర్కొంటున్నారు. దాదాపుగా వీరే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, కొత్త ఇంఛార్జ్ ల పైన సానుకూలత, పార్టీ కేడర్ నుంచి అనుకూలత లేని నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అవసరమైతే ఒకటి రెండు నియోజకవర్గాల్లో మరోసారి మార్పులు చేసేందుకు సిద్దమనే చర్చ పార్టీలో జరుగుతోంది.

ప్రతీ నియోజకవర్గంలో గెలుపును సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. సంక్షేమం - సామాజిక న్యాయం అస్త్రాలుగా ప్రచారం చేస్తూ...బలమైన అభ్యర్దులనే రంగంలో ఉంచాలని డిసైడ్ అయ్యారు. దీంతో, భిన్న కోణాల్లో క్షేత్ర స్థాయి సమచారం కోసం సర్వే నివేదికలను తెప్పించుకుంటున్నారు.

ఇక ప్రజల్లోకి: దీంతో..అభ్యర్దుల తుది ఎంపికలో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది పార్టీలో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ప్రకటించిన ఇంఛార్జ్ లే అభ్యర్దులుగా ఉంటారని చెబుతున్నారు. గెలుపు కష్టమని నివేదిక లు వస్తే మాత్రం ఆ నియోజకవర్గాల్లో మాత్రం మార్పులు తప్పవని పేర్కొంటున్నారు.

అందులో భాగంగా ఇప్పటి వరకు ప్రకటించిన 60 అసెంబ్లీ ఇంఛార్జ్ ల్లో గుంటూరు జిల్లా నుంచి ఇద్దరి ఎంపిక పైన ప్రతికూల నివేదికలు వస్తున్నట్లు సమాచారం. ఇక, జగన్ పార్టీ కేడర్ తో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో వచ్చే పార్టీ శ్రేణుల నుంచి వచ్చే స్పందన..సర్వేలు ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ అవసరమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+