లెక్క తప్పని జగన్ స్కెచ్ - ఆట మొదలైంది : అదే అసలు బలం- వై నాట్ 175..!?

ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రత్యర్ధులు ఏకమవుతున్నారు. జగన్ ను ఓడించేందుకు అన్ని శక్తులు కలుస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేసి జగన్ ను ఓడించలేమని డిసైడ్ అయ్యాయి. జగన్ మాత్రం నాడు సోనియా మొదలు నేటి వరకు సింగిల్ ఫైట్. ఇప్పుడు 2024 ఎన్నికల్లోనూ ఒంటిరి పోరాటమే. ఇప్పుడు చంద్రబాబు - పవన్ కల్యాణ్ భేటీతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ స్టాండ్ పైన క్లారిటీ లేదు. బీజేపీ నేతలు టీడీపీతో కలిసేందుకు సిద్దంగా లేరు. ఇప్పుడు జగన్ సమర్థకు పరీక్ష. వీరందరిని కలిసి కట్టుగా ఎదుర్కొంటున్న జగన్.. ఇప్పటికే తన విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక చాలా లెక్కలు ఉన్నాయి. జగన్ సక్సెస్ అవుతారా.. ఏం జరుగుతోంది..

2014 పొత్తులు.. జగన్ ఒంటరి పోరాటం

2014 పొత్తులు.. జగన్ ఒంటరి పోరాటం

ఏపీలో తిరిగి 2014 పొత్తుల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ ఏం చేయబోతోందనేది కీలకం. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఇప్పుడు పోటీ చేస్తోంది. జనసేన 25-30 స్థానాల మధ్య పోటీ చేసే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. టీడీపీ - జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే జగన్ వ్యతిరేక ఓటు చీలుతుందని..ఆ అవకాశం లేకుండా కలసి కట్టుగా పోటీ చేసి జగన్ ను ఓడిస్తామని చెబుతున్నారు. కానీ, వేర్వేరుగా పోటీ చేస్తే ఎదురయ్యే ఫలితాలను సర్వే నివేదికలు మూడు పార్టీల దగ్గర ఉన్నాయి. జగన్ పూర్తి స్థాయిలో ఎన్నికల్లో దిగటం 2014లో తొలి సారి. ఆ ఎన్నికల్లో 67 స్థానాలు సాధించారు. టీడీపీ- బీజేపీ కలిసి 102 సీట్లు దక్కించుకున్నాయి. అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా 1.95 శాతం. అప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మూడు పార్టీలు. ఇప్పుడు రెండు పార్టీలు. మూడో పార్టీపై స్పష్టత లేదు.
ప్రతిపక్ష నేత టు సీఎం.. మరి 2024లో

ప్రతిపక్ష నేత టు సీఎం.. మరి 2024లో


నాడు ప్రతిపక్ష నేతగా ఉంటూనే... ప్రజలకు దగ్గరయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉండే ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. చంద్రబాబు మూలాల పైన దెబ్బ కొట్టారు. విశ్వసనీయత పైనే గురి పెట్టారు. సుదీర్ఘ పాదయాత్ర చేసారు. సామాజిక సమీకరణాలు పక్కగా అమలు చేసారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా జనసేనాని మాట్లాడారు. జనసేన విడిగా పోటీ చేసింది. అక్కడ చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది. కానీ, టీడీపీకి కలిసి రాలేదు. ఎవరి లెక్కలకు అందకుండా జగన్ 151 సీట్లు దక్కించుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే 2024 ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేయటం ప్రారంభించారు. చంద్రబాబును స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదలు అన్ని సామాజిక వర్గాలకు దూరం చేసే వ్యూహాలు అమలు చేసారు. ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉన్న మహిళలకే పథకాలు అందించారు. ఇప్పటికే మూడున్నార లక్షల కోట్ల మేర పథకాలను పంపిణీ చేసారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదలే తన బలంగా నమ్ముతున్నారు. వాళ్లకు మంచి జరిగిందని నమ్మితేనే ఓటు వేయమని చెబుతున్నారు.

వై నాట్ 175 - ఆ ధీమా వెనుక

వై నాట్ 175 - ఆ ధీమా వెనుక


జగన్ తిరిగి అధికారం ఖాయమనే ధీమాతో ఉన్నారు. చంద్రబాబు - పవన్ కలవటంతోనే జగన్ బలం ఏంటనేది స్పష్టం అవుతోందని వైసీపీ నేతుల చెబుతున్నారు. ఇద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2014-19 ఏం జరిగిందో జగన్ గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు పేదలు - పెత్తందార్ల మధ్య పోరాటం గా నినదిస్తున్నారు. జగన్ అధికారంలోకి రాకపోతే పథకాలు అమలు కావనే ప్రచారం కొనసాగుతోంది. సచివాలయ వ్యవస్థతో ఇంటి ముందుకు పాలన వచ్చింది. వాలంటీర్లతో గడప వద్దకే సేవలు అందుతున్నాయి. నాడు నేడుతో గ్రామాల్లో కొత్త బడులు కనిపిస్తున్నాయి. ఆస్పత్రుల్లో మార్పులు మొదలయ్యాయి. కరోనా - ఆర్దిక కష్టాలు ఉన్నా పథకాలు ఆగలేదు. క్యాలెండర్ ఇచ్చి మరీ అమలు చేసారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాల్లోనూ రాజకీయంగా పై చేయి సాధించారు. ఇక, ప్రత్యర్ధుల కలయికే తమకు సగం బలం అని వైసీపీ నమ్ముతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటే పాజిటివ్ ఓటు ఎక్కువగా ఉందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. తిరిగి అధికారం ఖాయమని నమ్ముతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+