Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం - మెజార్టీ ఓట్ బ్యాంక్ పై ఫోకస్...!!

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఇప్పటి వరకు ప్రతి వరకు ప్రతిపక్షాలు భావిస్తూ వచ్చాయి. కానీ, ప్రభుత్వం వరుసగా ఉద్యోగుల అనుకూల నిర్ణయాలతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఉద్యోగులు..పెన్షనర్ల మద్దతు కీలకం కానుంది. ఈ సమయంలోనే ప్రభుత్వం తాజాగా 12వ పీఆర్సీ ప్రకటించింది. దీని పైన ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Recommended Video

    Jagan New Strategies ఆ ఓట్ బ్యాంక్ పై Focus పెట్టేసాడుగా | Andhra Pradesh | Telugu OneIndia

    ఉద్యోగుల అనుకూల నిర్ణయాలు : ఉద్యోగుల సమస్యలపైన గత నెల కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సీపీఎస్ పరిష్కారానికి కొత్త విధానం అమల్లోకి తెచ్చిది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. సీపీఎస్ స్ధానంలో కొత్తగా ఉద్యోగికి రిటైర్ అయిన సమయంలో వచ్చే వేతనంలో 50 శాతం మేర పెన్షన్ గా అందేలా గ్యారంటీ పెన్షన్ స్కీం కోసం కొత్తు ముసాయిదాకు ఆమోదం తెలిపింది.

    jagan11

    ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపు పైన స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా 11వ పిఆర్‌సి కాలపరిమితి గత నెల్లోనే ముగిసిన నేపథ్యరలో 12వ పిఆర్‌సిపై తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కమిషన్‌కు టిఒఆర్‌ (టర్మ్‌ ఆఫ్‌ రిఫరెన్సెస్‌) కూడా ఖరారు చేశారు. ఉద్యోగులకు చెల్లిరచాల్సిన ప్రత్యేక చెల్లింపులు, పరిహారాలు, ఇతర అలవెన్సులపైనా కమిషన్‌ సిఫార్సులు చేయాల్సి ఉరటుంది.

    12వ పీఆర్సీ ఏర్పాటు : పీఆర్సీ ఉద్యోగుల ప్రస్తుత చెల్లింపులు..జీవన ప్రమాణాలు..సూచనలు..సలహాలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇందుకు కమిషన్ కు ప్రభుత్వం ఏడాది సమయం కేటాయించింది. పీఆర్సీ కమిషన్ ఉద్యోగులతో పాటుగా పెన్షనర్ల అంశాల పైన ప్రభుత్వానికి సిఫార్సులు ఇవ్వాల్సిందిగా సూచించింది. నగదు రూపంలో, ఇతర రూపాల్లో చేయాల్సి చెల్లిరపులపైనా కమిషన్‌ సిఫార్సులు చేయాల్సి ఉంటుంది.

    ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య, అరదులో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వివరాలతో కూడా కమిషన్‌ అధ్యయనం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలకలకు ఎనిమిది నెలల సమయం ఉంది. కమిషన్ తుది నివేదిక ఇచ్చే లోగా గత సంప్రదాయాల మేరకు ప్రభుత్వం మధ్యంతర భృతిని (ఐఆర్)ను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

    jagan12

    ఐఆర్ ప్రకటన పైన ఆశలు : ప్రభుత్వ అనుబంధ సంస్థలు..రంగాల్లోని వారికి నూతన పీఆర్సీ ప్రయోజనాలు అందనున్నాయి. ఏపీలో ఎన్నికల సీజన్ ప్రారంభం కావటంతో దసరా సమయంలో ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. త్వరగా ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నాయి.

    ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న ఉద్యోగ అనుకూల నిర్ణయాల పైన ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో కీలకంగా వ్యవహరించే ఉద్యోగ, ఉపాధ్యా, కార్మిక సంఘాలకు మేలు చేసే ఈ నిర్ణయాల ద్వారా సీఎం జగన్ ఎన్నికల్లో తన ఓట్ బ్యాంక్ మరింత పెంచుకోవటం ఖాయమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+