వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వర్సెస్ జగన్: ఆ రహస్యం ఇదే -ఆమెను చూసైనా మారాలి -ఎంపీ రఘురామ -బూతుపురాణం

|
Google Oneindia TeluguNews

అనర్హత వేటు పిటిషన్ ఇప్పట్లలో తేలే అవకాశాలు లేకపోవడంతో సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల దాడిని ముమ్మరం చేశారు. వైసీపీ అధ్యక్షుడిగా చెప్పిన మాటలు, చేసిన వాగ్ధాలకు పూర్తి విరుద్ధంగా ముఖ్యంత్రి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ కు కేవలం విషెచ్ చెప్పి వదిలేయకుండా, ఆమె తల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎంకు సూచించారు. 'రాజధాని రచ్చబండ'లో భాగంగా సోమవారం రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్

 జగన్ వర్సెస్ జగన్

జగన్ వర్సెస్ జగన్

‘‘ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఏం చెప్పారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారు? తీసుకున్న వంకర నిర్ణయాలు ఎన్ని? అనే ప్రశ్నలు ఇవాళ చర్చనీయాంశం అయ్యాయి. సుదీర్ఘ పాదయాత్రతో పార్టీని అధికారంలోకి తెచ్చిన వైసీపీ అధినేత మాటను ఇవాళ సీఎం పెడచెవిన పెడుతున్నారు. రాజధాని అమరావతి నుంచి మద్యనిషేధం, ఉద్యోగుల పెన్షన్ విధానం, కులమతాలకు అతీతంగా ప్రజలకు లబ్ది, పెన్షన్ల పెంపు, పీపీఏల ప్రక్షాళన, పోలీస్, ఫారెస్ట్ వ్యవస్థల బలోపేతం.. ఇలా పాదయాత్రలో పార్టీ అధినేత ఇచ్చిన ప్రతి మాటకు.. ఇవాళ సీఎం మడమతిప్పినట్లుగా వ్యవహరిస్తున్నారు. తద్వారా జగన్ తనకు తానే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. బ్రీఫ్ ఉదాహరణలతో ముఖ్యమైన విషయాల్లోకి వెళితే..

 బాబు 20 ఏళ్లు.. జగన్ 30 ఏళ్లు..

బాబు 20 ఏళ్లు.. జగన్ 30 ఏళ్లు..

జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి మార్చేస్తారని గతంలో విమర్శలొస్తే పార్టీ చీఫ్ గా ఆయన చాలా కరాకండిగా ఖండించారు. కానీ సీఎం అయ్యాక రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. మద్యపానం దిశగా వెళదామని చెప్పారు.. మద్యం ద్వారా ఆదాయం లేకుండా గుజరాత్ అగ్రగామి రాష్ట్రంగా ఎదగలేదా? అని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పిన మాటలను మహిళలు నమ్మారు. కానీ ఇప్పుడు ఏపీ మద్యం ఆదాయం రెట్టింపైంది. మద్యం పన్నులు, ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. చంద్రబాబు హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్(పీపీఏ)లు 20 ఏళ్ల కాలానికి రాసిస్తే దాన్ని తూర్పారా పట్టిన వైసీపీ అధినేత.. ఇవాళ ముఖ్యమంత్రిగా అవే పీపీఏలను 30 ఏళ్లకు కుదుర్చుకుంటున్నారు. అంతేకాదు..

 డీఈకి సోలార్ సీవోవో పోస్టా?

డీఈకి సోలార్ సీవోవో పోస్టా?

ఉద్యోగులకు పాత పద్ధతిలోనే సీపీఎస్ ను అమలు చేస్తామని వైసీపీ చీఫ్ హామీ ఇస్తే.. సీఎం జగన్ మత్రం ఆ ఫైలునే బుట్టదాఖలు చేశారు. కులమతాలకు అతీతంగా ఉంటామని వైసీపీ అధ్యక్షుడు చెప్పగా.. సీఎం మాత్రం ప్రభుత్వ, ప్రభుత్వేతర 777 పోస్టుల్లో రెడ్డి కులస్తులను కూర్చోబెట్టారు. తాజాగా ఒక సాధారణ స్థాయి డీఈ మురళీకృష్ణారెడ్డిని ఏకంగా సోలార్ పవర్ కార్పొరేషన్ సీవోవోగా నియమించారు. అవ్వాతాతలకు పెన్షన్లు పెంచుతామని పాదయాత్రలో ప్రామిస్ చేసి, సీఎం అయ్యాక ఆ మాటే మరిచిపోయారు. ఇటీవలి అమెరికా ఎన్నికల ఫలితాలపై స్పందన తెలియజేసి జగన్ అసలు విషయాన్ని మర్చిపోయారు..

 కమలా హ్యారిస్ కుటుంబాన్ని చూసైనా..

కమలా హ్యారిస్ కుటుంబాన్ని చూసైనా..

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ తల్లి శ్యామలా హ్యారిస్. ఆమె ఆనాడే అమెరికా వెళ్లి, జమైకన్ ను పెళ్లి చేసుని, విడిపోయినా, తన భారతీయ మూలాలను మాత్రం మర్చిపోలేదు. కూతుళ్లకు మన సంస్కృతిలో పేర్లు పెట్టి, ప్రతి మంచి పనికి గణపతికి పూజలు చేసేవారు. ఇవాళ కమలను మమంతా ఓన్ చేసుకుంటున్నామంటే అది సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతీయ అనుబంధమేనని మర్చిపోరాదు. అలాంటిది సీఎం జగన్ మాత్రం సొంత తెలుగు సంస్కృతి, భాషను కాదని పరాయి భాష ఇంగ్లీషును బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జగన్ ఆలోచించాలి. నిజానికి ఇక్కడొక అతి ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి..

జగన్ గెలుపు రహస్యం ఇదే..

జగన్ గెలుపు రహస్యం ఇదే..

వైసీపీ అధినేతగా ఎన్నెన్నో రికార్డులు, అద్భుతాలు చేసిన జగన్ కు, ముఖ్యమంత్రి జగన్ కు మధ్య కీలకమైన, అతి ముఖ్యమైన తేడా ఒకటి ఉంది. ఇవాళ ఆయనతో ఆయనకే క్లాష్ రావడానికి అసలైన ముఖ్య కారణం కూడా అదే. రాజకీయ నేతగా జగన్ సూపర్ సక్సెస్ వెనుక ఒక రహస్యం ఉంది. అదేంటంటే.. గడిచిన పార్టీ అధినేతగా జగన్ తన పని తాను సొంతగా చేసుకుంటూ పోయేరే తప్ప నాడు అడ్వైజర్లను పెట్టుకోలేదు. తన సొంత నిర్ణయాలు, ఆలోచనాబలంతోనే ఆయన 151 సీట్లు గెలవగలిగారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ సొంత ఆలోచనలకు బదులుగా చాలా మంది అడ్వైజర్లను పెట్టుకుని సలహాలు తీసుకుంటున్నారు. కాబట్టే పరస్పర వ్యతిరేక నిర్ణయాలు వస్తున్నాయి. చివరికి తానిచ్చిన వాగ్ధాలనే పక్కన పెట్టేసి, వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్.. పార్టీ అధ్యక్షుడిగా తానేం చెప్పానో గుర్తుచేసుకోవాలి. పనికిమాలిన సలహాదారుల్ని తక్షణమే పక్కన పెట్టేయాలి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు సూచించారు.

ఎంపీ రఘురామ బూతుపురాణం..

ఎంపీ రఘురామ బూతుపురాణం..

‘రాజధాని రచ్చబండ' పేరుతో గత నాలుగు నెలలుగా ఢిల్లీ నుంచి వరుస ప్రెస్ మీట్లు నిర్వహిస్తోన్న వైసీపీ ఎంపీ రఘురామ తాజాగా వాటిని కుదించుకుని, వారానికి రెండురోజులే మాట్లాడుతానని గత గురువారం చెప్పారు. దానికి విరుద్ధంగా సోమవారం నుంచే విమర్శల పరంపరను పున:ప్రారంభించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. ఎంపీ కూర్చున్న చోటికి కోతుల గుంపు దూసుకొచ్చింది. అందర్నీ కామ్ గా ఉండాలని ఎంపీ చెప్పినా, ఓ వ్యక్తి మాత్రం కోతుల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో రఘురామ లైవ్ ప్రసారంలో ఉన్నానని మర్చిపోయి.. ‘‘చెత్తనా.. పిచ్చినా.. ఎర్రి.. యూజ్ లెస్ ఫెలో..''అంటూ బూతుపురాణం అందుకున్నారు.

చైనా మరో సంచలనం: ఆర్థికంగా దెబ్బతీస్తామని వార్నింగ్ - మలబార్ విన్యాసాలపై డ్రాగన్ బుసబుసచైనా మరో సంచలనం: ఆర్థికంగా దెబ్బతీస్తామని వార్నింగ్ - మలబార్ విన్యాసాలపై డ్రాగన్ బుసబుస

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju alleged that ap chief minister ys jagan is doing compleate opposite to what he promissed as ysrcp chief. speaking to media in delhi on monday, the rebel mp criticised ysrcp ruling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X