సీఎం జగన్ పోలవరం పర్యటన: క్షేత్ర స్థాయి పనుల పరిశీలన

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ వద్ద పర్యటిస్తున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం జగన్ అధికారులకు దిశా నిర్దేశం చెయ్యనున్నారు. ఒక్క ఏడాదిలో పోలవరం పూర్తి చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పిన జగన్ పోలవరంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో నేడు ప్రాజెక్ట్ ను సందర్శించిన సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఇక అధికారులతో పోలవరం పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేయనున్నారు.

Recommended Video

    AP CM YS Jagan Visited Polavarm Project And Examined The Works! | Oneindia Telugu

    పోలవరం పురోగతి పనులను పరిశీలించి అధికారులతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించనున్న సీఎం జగన్ సీఎం హోదాలో రెండోసారి జగన్ పోలవరానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను జగన్ తిలకించారు.ఉదయం 10 గంటల 50 నిమిషాలకు ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం జగన్ పనుల పురోగతి గురించి తెలుసుకుని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక ఇప్పుడు పనుల పర్యవేక్షణ అనంతరం ఇరిగేషన్‌, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో భేటీ అయి పనులపై రివ్యూ చేయనున్నారు.

    CM Jagan Polavaram tour ... field level work inspection

    రాష్ట్రంలో సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాజెక్ట్ ల నిర్మాణమే పరిష్కారం అని భావిస్తున్న జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే . రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయడానికి ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. మొన్నటికి మొన్న వెలిగొండ ప్రాజెక్ట్ ను సందర్శించి క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన చేసిన జగన్ నేడు పోలవరం ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రజల సాగునీటి అవసరాలను తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు నడిచేలా సీఎం జగన్ సూచనలు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+