మేకపాటి నాటి రాజీనామా వెనుక : గౌతమ్ గురించి ఎంత చెప్పినా - సీఎం జగన్..!!

మేకపాటి గౌతమ్ కు సీఎం జగన్ నివాళి అర్పించారు. నెల్లూరులో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు చిన్నతనం నంచి గౌతమ్ తెలుసని.. వయసులో తనకంటే పెద్దవాడైనా తనతో ఒక సోదరుడిగా..ప్రేమతో ఉండేవారని చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్ ను వీడి వైసీపీ ఏర్పాటు చేసిన సమయంలో మేకపాటి రాజమోహన రెడ్డి తనతో పాటుగా రాజీనామా చేయటం .. తిరిగి వైసీపీ ఎంపీగా తనతో పాటుగా గెలవటం వెనుక గౌతమ్ ఉన్నారని చెప్పారు. రాజమోహన్ రెడ్డి కంటే గౌతమ్ తో ఎక్కువ సాన్నిహిత్యం..ఆత్మీయత ఉండేవని పేర్కొన్నారు.

గౌతమ్ ఆత్మీయత మర్చిపోలేం

గౌతమ్ ఆత్మీయత మర్చిపోలేం


తాను లేకుంటే గౌతమ్ రాజకీయాల్లో వచ్చే వారు కాదేమోనని చెప్పుకొచ్చారు. గౌతమ్ కారణంగానే తనకు రాజమోహన్ రెడ్డి మద్దతు లభించిందన్నారు. రాజకీయంగా తనను ఎంతో ప్రోత్సహించే వారని గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఆరు శాఖలను సమర్ధవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. మంచి స్నేహితుడు..మంచి వ్యక్తిని కోల్పోయానని చెబుతూ సీఎం కొంత ఎమోషనల్ అవుతూ తన ప్రసంగం కొనసాగించారు. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఎంతో తాపత్రయపడ్డాడని, చివరి క్షణం వరకూ రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారని చెప్పారు.

మేకపాటి కుటుంబానికి అండగా నిలుస్తాం

మేకపాటి కుటుంబానికి అండగా నిలుస్తాం


గౌతం కుటుంబానికి పార్టీతో పాటు అందరూ అండగా ఉంటామని అభయం ఇచ్చారు. మేకపాటి గౌతమ్ పేరుతో ఉదయగిరి కాలేజీని యూనివర్సిటీగా మార్చే అంశాన్ని పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉదయగిరి..బద్వేలు..ఆత్మకూరు కు ఎంతో మేలు జరుగుతుందని..మేకపాటి కోరిన విధంగా వీటిని త్వరగా అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఇక, ఇప్పటికే ప్రకటించిన విధంగా సంగం బ్యారేజీకి గౌతమ్ పేరు పెడతామని.. మే 15 లోగా ఆ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు. గౌతమ్ కటుుంబ సభ్యులతో కలిసి సంగం బ్యారేజిను ప్రారంభిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.

రాజకీయ ప్రాధాన్యతపైన చర్చ

రాజకీయ ప్రాధాన్యతపైన చర్చ

ఈ నెలలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో మేకపాటికి నివాళి అర్పించటంతో పాటుగా.. మేకపాటి కుటుంబం నుంచి అభ్యర్ధనులను అన్నీ పరిష్కరించి... ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని సీఎం హామీ ఇచ్చారు. గౌతమ్ సంతాప సభలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అందరూ హాజరయ్యారు. రాజకీయంగా మేకపాటి కుటుంబానికి ఎటువంటి ప్రాధాన్యత సీఎం ఇవ్వబోతున్నారనే చర్చ రాజకీయంగా సాగుతోంది. అయితే, కేబినెట్ విస్తరణ సమయంలోనే జగన్ ఈ అంశం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+