• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ విషయంపై గట్టిగా ప్రచారం చేయండి - మెసేజ్ క్లియర్‌గా వెళ్లాలి - సీఎం జగన్ కీలక ఆదేశాలు

|

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, మీటర్ల బిగింపు వల్ల రైతులపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడబోదన్న విషయాన్ని గట్టిగా ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో విద్యుత్‌ శాఖ, వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌పై సమీక్ష నిర్వహించిన ఆయన వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు.

వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ సీఎండీ జి.సాయిప్రసాద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్‌.శ్రీకాంత్, ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్‌తో పాటు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..

జస్టిస్ రమణ పిల్లలపై ఫాల్తూ కేసు - జగన్‌కు 60 నెలల జైలు - ఏపీలో ఆర్టికల్ 356: ఎంపీ రఘురామ

ఉచిత విద్యుత్ పకడ్బందీగా కోసమే..

ఉచిత విద్యుత్ పకడ్బందీగా కోసమే..

వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చడంపై రైతులకు అవగాహన కల్పించాలని, ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత పకడ్బందీగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు మీటర్ల ఏర్పాటు ఆవశ్యకమనే విషయాన్ని రైతులకు వివరించాలని, మీటర్ల ఏర్పాటు ప్రక్రియలో రైతులకు భారం పడబోదన్న అంశాన్ని కూడా గట్టిగా ప్రచారం చేయాలని సీఎం అన్నారు. మీటర్లు ఏర్పాటు వల్ల ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్‌ సరఫరాను తెలుసుకునే వీలు కలుగుతుందని, తద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయవచ్చని, ఆ విద్యుత్‌ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని అన్నారు.

సీబీఐ దాడిలో ఎంపీ బాలశౌరి పాత్ర - రష్యన్ యువతితో అది తప్పేంటి? - ఎంపీ రఘురామ తాజా బాంబు

నాణ్యతలో రాజీ పడొద్దు..

నాణ్యతలో రాజీ పడొద్దు..

నాణ్యమైన విద్యుత్‌ను 9 గంటల పాటు, నిరంతరాయం సరఫరా చేయడం కోసమే మీటర్ల ఏర్పాటు అన్న విషయంపై రైతులకు అర్థమయ్యేలా వివరించాలని, ఆ ప్రక్రియలో భాగంగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అపోహలకు తావు లేకుండా, రైతులకు మెసేజ్‌ క్లియర్‌గా చేరవేయాలని సీఎం అధికారులను కోరారు. ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యంఇవ్వాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ (ఈఈఎస్‌ఎల్‌)తో మాట్లాడాలని, ఐఎస్‌ఐ ప్రమాణాలు కలిగిన మోటర్లు, కెపాసిటర్లను మాత్రమే రైతులు వాడేలా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.

సోలార్ విద్యుత్‌పైనా ఫోకస్

సోలార్ విద్యుత్‌పైనా ఫోకస్

వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చే ప్రక్రియ నిమిత్తం ఇప్పటికే 14,354 లైన్‌మెన్లకు శిక్షణ ఇచ్చినట్లు సమీక్షలో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అన్ని ఫీడర్ల కింద వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ఇప్పటికే 97.5 శాతం ఫీడర్లు పూర్తి కాగా, మిగిలినవి కూడా నవంబరు నాటికి పూర్తవుతాయని తెలిపారు. మరోవైపు, 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే బిడ్‌ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని, జ్యుడీషియల్‌ ప్రివ్యూ పూర్తి కాగానే టెండర్లు పిలుస్తామని అధికారులు పేర్కొనగా, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.

English summary
Chief Minister YS Jaganmohan Reddy on Monday reviewed the power sector, YSS free electricity. Authorities have been instructed to supply quality electricity to the farm for 9 hours a day. CM Jagan told the officials that there should be a strong campaign that not a single rupee would be a burden on the farmers as long as the meters are fitted to the farm motors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X