రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనం కలిగేలా - టీడీపీలా మాది కుమ్మక్కు విధానం కాదు : సీఎం జగన్..!!

గత ప్రభుత్వం విద్యను కార్పెరేట్ సెక్టార్ కు అమ్మేసిందని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. గతంలో లాగా కార్పోరేట్ రంగంలో కుమ్మక్కు అయిన విధానం తమది కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా.. ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కొన్ని అంశాలు..సీపీఎస్ గురించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పదవ విరమణ చేసిన తరువాత మెరుగైన ప్రయోజనం కలిగించే విధంగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేసారు.

ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు

ప్రతిపక్షాలు..వారికి మద్దతుగా నిలుస్తున్న మీడియా ఉపాధ్యాయులను - ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత విద్యా శాఖ పైన చేసిన సమీక్షలు మరే ప్రభుత్వం పైనా చేయలేదన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో..విద్యా సంస్కరణల కు పెద్ద పీట వేస్తున్నామని వివరించారు.

దాదాపుగా 55వేల కోట్లు ఇందు కోసం ఖర్చు చేసామని చెప్పారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేందుకు నిర్ణయాలు తీసుకోలేదని.. విద్యార్ధుల భవిష్యత్ కోసం తీసుకొచ్చిన మార్పులుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. పేదరికం పెద్ద చదువులకు అడ్డంకి కాకూడదని.. అందరికీ చదువు అందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామన్నారు.

కార్పొరేట్ తరహా విద్య అందించే ప్రయత్నాలు

పేద విద్యార్ధులను ఇంగ్లీషు మీడియం కు విద్యార్ధులను దూరం చేసారని..ఇప్పుడు వారికి ప్రభుత్వ బడుల్లోనే ఆంగ్ల బోధనతో పాటుగా కార్పొరేట్ తరహా విద్య అందించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. తాము అమలు చేస్తున్న విధానాలు.. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే మార్పులు కావని సీఎం వివరించారు. ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను మిగిలిని అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకున్నామననారు.

ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం,..గుర్తింపు కోసం చేస్తున్న మార్పులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ టీచర్లు సైతం తమ పిల్లలను తమ బడుల్లోనే చదవించే మార్పు కోసం చేస్తున్న నిర్ణయాలుగా ముఖ్యమంత్రి అభివర్ణించారు, కార్పోరేట్ విద్యతో పోటీ పడి.. ఏ పరీక్షలో అయినా నెగ్గేలా చేసేందుకు ఈ మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఈ అక్షరాస్యత రేటును పెంచేలా.. అందరి కోసం తీసుకువస్తున్న అవసరమైన మార్పులగా సీఎం వెల్లడించారు.

ఉపాధ్యాయులు సహకారం అందించాలి

ఉపాధ్యాయులు సహకారం అందించాలి

ఉచిత - నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించారు. తమ ప్రయత్నంలో ఉపాధ్యాయులు తోడ్పాటు కీలకమని చెప్పుకొచ్చారు. ఎవరూ అడగకపోయినా.. పదవీ విరమణ వయసు పెంచామన్నారు. విద్య వ్యవస్థలో ఎవరూ అడగకుండానే పలు స్థాయిల్లో ప్రమోషన్లు అమలు చేసామని వివరించారు. ఉద్యోగుల పెన్షన్ విషయంలో చిత్తశుద్దితో..మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. గతంలో ఏనాడు ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుభూతి చూపలేదని విమర్శించారు. పెన్షన్ విషయంలో పరిష్కారం చూపని వాళ్లు..ఈ రోజు మనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. విద్యా రంగంలో మంచికి.. మార్పులకు కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+