Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ సంచలనం : ఎల్లో పార్టీ బాక్సులు బద్దలే - కుట్రలతో వాళ్లంతా : మంచి చేస్తేనే నన్ను దీవించండి...!!

ముఖ్యమంత్రి జగన్ పల్నాడు జిల్లా కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో పాలన సాగుతోందని చెప్పారు. మంచి జరిగితే దీవించండి... అంతే కానీ, ఎల్లో పార్టీ..దత్తపుత్రుడు చేస్తున్న దుర్మార్గపు ప్రచారం మాత్రం నమ్మవద్దని జగన్ పిలుపునిచ్చారు. తాను మారీచులు..రాక్షసులతో యుద్దం చేస్తున్నానని చెప్పారు. చంద్రబాబు అండ్ దత్తపుత్రుడు వారికి మద్దతిస్తున్న ఒక వర్గం మీడియా గజదొంగల ముఠాగా పేర్కొన్నారు. నవరత్నాల పాలన సాగితే తమకు డిపాజిట్లు దక్కవనే ఏడుపు వారిలో కనిపిస్తోందన్నారు. ఎల్లో పార్టీ..అనుబంధ పార్టీతో కలిసి కుట్రలు - కుముక్తులు చేస్తోందని ఆరోపించారు.

ఎల్లో పార్టీ..అనుబంధ పార్టీ అంటూ ఫైర్

ఎల్లో పార్టీ..అనుబంధ పార్టీ అంటూ ఫైర్

వీరందరూ హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ఇలాగే పథకాలు కొనసాగుతూ..అందరికీ మేలు జిరగితే వారి బాక్సులు బద్దలవుతాయని వారికి తెలుసని పేర్కొన్నారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు..ఆయన దత్తపుత్రుడు కొత్త ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే శ్రీలంక.. అమలు చేయకుంటే అమెరికా అవుతుందనేది వారి ప్రచారం అని ఎద్దేవా చేసారు. రాష్ట్ర ఖజానా దోచుకున్న దొంగల ముఠా అంటూ సీఎం ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని దోచుకొని...అప్పుల పాల్జేసారని దుయ్యబట్టారు. అబద్దాలు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధానితో మంచి వాతావరణంలో మీటింగ్ జరిగిందన్నారు. అయితే, అక్కడ సోఫా కింద కూర్చొని విన్నట్లుగా అబద్దాలు రాస్తున్నారని మండిపడ్డారు.

గుండెపోటు వచ్చి త్వరగా టికెట్

గుండెపోటు వచ్చి త్వరగా టికెట్

అసూయ పెంచుకుంటే బీపీలు పెరిగి గుండెపోటులు వస్తాయని..త్వరగా టికెట్ తీసుకుంటారంటూ సీఎం వ్యాఖ్యానించారు. వ్యతిరేక ఓటు చీలకుండా ఏకం అవుతారని.. వారి పేర్లు వేర్వేరు అయినా అందరూ ఒక్కటేనని చెప్పారు. వాళ్ల మాటలు నమ్మవద్దంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఇక, ఇప్పటి వరకు లక్షా 34 వేల కోట్ల రూపాయాలు పేదలకు అందించామని చెప్పిన ముఖ్యమంత్రి...ఇది కాదా అభివృద్ధి అని ప్రశ్నించారు. ప్రతీ అర్హుడికి పధకాలు అందుతున్నాయంటే ఇంత కంటే గొప్ప పాలన ఉంటుందా అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మరో 55 వేల కోట్ల పేదలకు అనేక పధకాల కింద అందిస్తున్నట్లు వెల్లడించారు. వాలంటీర్లు చేస్తున్న సేవలకు సీఎం సెల్యూట్ చేసారు.

ఏ ప్రభుత్వమూ చేయని విధంగా.. మరో రెండేళ్లు

ఏ ప్రభుత్వమూ చేయని విధంగా.. మరో రెండేళ్లు

లంచాలకు..వివక్షకు తావు లేని వ్యవస్థ వాలంటీర్లుగా చెప్పారు. దేశం మొత్తం ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థ వైపు చూస్తోందన్నారు. వాలంటీర్లు తమకు ఎంత వస్తుందనే దాని కంటే..తాము ఎంత సేవలు ఇచ్చామనే అంశం పైనే ఫోకస్ పెడుతున్నారని చెప్పుకొచ్చారు. వాలంటీర్లు..గొప్ప సేవకులు..గొప్ప సైనికులు అంటూ ప్రశంసించారు. రానున్న 20 రోజుల పాటు వారిని ప్రభుత్వం తరపున సత్కరిస్తామని చెప్పారు. చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మంచి చేసే అవకాశం తనకు దక్కిందని..వచ్చే రెండేళ్ల కాలంలోనూ ఇదే విధంగా అందిస్తామని సీఎం ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+