షాకింగ్ నిజాలు చెప్పి చంద్రబాబుకు నిద్ర లేకుండా చేసిన సీఎం జగన్ .. బాబు నిఘా షురూనా ?

Recommended Video

    చంద్రబాబుకు నిద్ర లేకుండా చేసిన జగన్ || Oneindia Telugu

    అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు కి షాక్ ఇచ్చాయి. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది తనతో టచ్లో ఉన్నారని, తాను గేటు తీస్తే టీడీపీ ఖాళీ అవుతుందని జగన్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్ చంద్రబాబుకు పార్టీ భవిష్యత్ పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోంది.

    అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు జగన్ షాక్ .. ఖంగు తిన్న బాబు

    అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు జగన్ షాక్ .. ఖంగు తిన్న బాబు

    ఏపీలో ఎన్నికలలో ఘోర ఓటమిపాలై 23 మంది ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే సొంతం చేసుకున్న టిడిపికి ఇప్పుడు అసెంబ్లీలో కక్కలేని మింగలేని పరిస్థితి నెలకొంది.ఇక అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు జగన్ . ఇక శాసనసభ సమావేశాలలో తొలి సమావేశాల నుండే టిడిపిని టార్గెట్ చేస్తూ ఏపీ సీఎం జగన్ తన దూకుడు చూపిస్తున్నారు. ఇది చంద్రబాబుకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. అంతేకాదు ఇప్పటికే టిడిపి హయాంలో చేసిన పలు అభివృద్ధి పనులపై, తీసుకున్న కీలక నిర్ణయాలపై సమీక్ష చేసి తిరిగి నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్.

    టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని జగన్ షాక్ .. తాను గేట్లు తీస్తే టీడీపీ క్లోజ్ అంటున్న జగన్

    టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని జగన్ షాక్ .. తాను గేట్లు తీస్తే టీడీపీ క్లోజ్ అంటున్న జగన్

    టిడిపి అవినీతికి పాల్పడిందని, ఆ అవినీతిని బయట పెట్టాలన్న ఆలోచనలో ఉన్న జగన్ ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. తొలి సమావేశాల్లోనే జగన్ మాటల్లో టిడిపి టార్గెట్ అన్నది స్పష్టంగా అర్థమైంది .

    ఇక జగన్ చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టించే మరో బాంబు కూడా పేల్చారు. టిడిపి ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని తాను గేట్లు తీస్తే టీడీపీ ఖాళీ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబుకు నిద్రపట్టని పరిస్థితి నెలకొంది.

    సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టిన చంద్రబాబు ..తన సొంత టీం తో ఎంక్వైరీ

    సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టిన చంద్రబాబు ..తన సొంత టీం తో ఎంక్వైరీ

    దీంతో చంద్రబాబు నిఘా షురూ చేసినట్టు తెలుస్తుంది . తమ పార్టీ కీలక నేతల పైన ఎమ్మెల్యేల పైన నిఘా ఏర్పాటు చేశారు. వైసీపీ ,బీజేపీ నేతలతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల పై నిఘా పెట్టిన చంద్రబాబు ఇప్పటికే వారిని ఓ కంట కనిపెడుతూ ఉన్నారు. ఇక జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ తో ఎవరెవరు టచ్లో ఉన్నారన్న దానిపై తన సొంత టీమ్ తో ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనా జగన్ మాటల ఎఫెక్ట్ చంద్రబాబుకు గట్టిగా తగిలినట్టు గానే కనిపిస్తుంది.

    కాకుంటే నిఘా పెట్టినా, బతిమాలినా పార్టీ మారాలనుకునే వారు ఆగుతారా చంద్రబాబు అనవసరపు నిఘా కాకుంటే అన్న చర్చ సైతం ఇప్పుడు ఏపీలో జరుగుతుంది .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+