వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

63 లక్షల మంది గుండెల్లో సీఎం జగన్ - ఏటా రూ 18 వేల కోట్లతో : ఏకైక రాష్ట్రంగా ఏపీ..!!

|
Google Oneindia TeluguNews

వయసు పై బడిన లక్షల మందికిపెద్ద కొడుకుగా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. అనారోగ్యంతో ..ఒంటరిగా ఉంటూ జీవితంతో కష్టాలు ఎదుర్కొంటున్న వారికి సీఎం జగన్ ఆసరా కల్పించారు. నవరత్నాల్లో భాగంగా నాడు పాదయాత్ర సమయంలో..ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నేడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్నారు. నాడు వైఎస్సార్ సంక్షేమంలో ఒక అడుగు ముందుకేస్తే..ఆయన కుమారుడు గా జగన్ నాలుగు అడుగులు ముందుకు వేసారు. మాట ఇచ్చారంటే ..చేస్తారంతే అనే నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం రూ రెండు వేల పెన్షన్ ను రూ 2,250కి పెంచారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ

ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ

అయిదేళ్ల కాలంలో పెన్షన్ మొత్తాన్ని మూడు వేల రూపాయాలకు పెంచుతామని జగన్ నాడు హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2022, జనవరి 1వ తేదీ నుంచి మరో రూ 250 పెంచుతూ.. ఆ మొత్తాన్ని రూ 2500 కి పెంచారు. దీంతో..ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ 2,500 రూపాయాల చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పేరుతో వృద్ధులకే కాదు.. అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఆర్దికంగా తోడ్పాటు అందిస్తోంది. వితంతు..వికలాంగ..చేనేత..కల్లుగీత..డయాలసిస్ బాధితులు..ఒంటరి మహిళ..ట్రాన్స్ జెండర్..వికలాంగులు..చర్మకారులు..తలసేమియా బాధితులు..పక్షవాతం .. మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు అండగా నిలుస్తోంది. వృద్ధాప్యం అనేది భారం కాకుండా ఉండాలనే ఆలోచనతో అర్హులైన అవ్వాతాతలందరికీ క్రమం తప్పకుండా ఫించన్లు అందే ఏర్పాటు చేసారు. ఆ బాధ్యత వార్డు వాలంటీర్లకు అప్పగించారు.

ప్రతీ నెలా 1వ తేదీనే క్రమం తప్పకుండా

ప్రతీ నెలా 1వ తేదీనే క్రమం తప్పకుండా


ప్రతీ నెలా 1వ తేదీనే క్రమం తప్పకుండా అందిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతోంది. 62.69 లక్షల మంది పెన్షనర్లకు రూ.1594.66 కోట్లు ప్రతీ నెలా అందిస్తున్నారు. పింఛన్ల పథకానికి సంబంధించి ఆ మొత్తాన్ని రూ. 2, 250కి పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తన ప్రమాణ స్వీకారోత్సవం రోజున సంతకం చేశారు. అంతే కాదు ఈ మొత్తాన్ని దశలవారీగా పెంచుతూ మూడువేల రూపాయలకు తీసుకుపోతామని ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది జనవరినుంచి 2500 రూపాయలు చేశారు. అవ్వాతాతల పింఛన్‌ అర్హత వయస్సు గతంలో 65 ఏళ్లు వుండేది.. దాన్ని అరవై ఏళ్లకు కుదించారు.. అంతే కాదు రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హత వుంటే చాలు... ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పిన వైఎస్ జగన్ - అదే విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

ఇప్పటి వరకు రూ 45 వేల కోట్ల మేర

ఇప్పటి వరకు రూ 45 వేల కోట్ల మేర


దాంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పింఛన్లు పెరిగాయి. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతు మంచానికే పరిమితమైన వారికి పదివేల రూపాయల పింఛన్‌ ఇస్తున్నారు. కుటుంబంలో ఒకరికే కాదు.. అర్హత వున్నవారందరికీ పింఛన్‌ ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో 36 లక్షల మందికి పెన్షన్లు వస్తే... వైఎస్ జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి అందిస్తోంది. సామాజిక పింఛన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రతి నెలా కేవలం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు 1500 కోట్లు ఖర్చు చేస్తోంది. పింఛన్లను డోర్‌ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా.... ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపుపొందింది. ఇలా పింఛన్ల విషయంలో అనేక ప్రత్యేకతలు కలిగిన వైఎస్ జగన్ ప్రభుత్వం... అవ్వాతాలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకే కాదు...దీర్ఘకాల రోగాలతో మంచానికి పరిమితమైన వారికి కూడా పింఛన్లు అందిస్తోంది.

65 లక్షల మంది మదిలో జగన్

65 లక్షల మంది మదిలో జగన్


అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,570 కోట్లకు పైనే వెచ్చిస్తూ.. ఏటా రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.45 వేల కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. పెన్షన్ తీసుకొనే వారు ఆస్పత్రుల్లో ఉన్నా.. వేరే ఇబ్బందుల్లో వేరే ప్రాంతాల్లో చిక్కుకున్నా వారి వద్దకే వాలంటీర్లు వెళ్లి పెన్షన్ అందించిన సందర్బాలు అనేకం ఉన్నాయి. దీంతో..ఇప్పుడు లక్షలాది మంది గుండెల్లో జగన్ నిలిచిపోయారు.

English summary
CM Jagan stands in the hearts of 6 million beneficiaries with YSR pension Kanuka, Around 45 thousand cr distributed so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X