అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ కు కొరియన్ కిట్ తో కరోనా టెస్ట్ - రిజల్ట్ ఏంటో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్తగా తెప్పించిన కరోనా టెస్టింగ్ కిట్ లను ముందుగా తాను పరీక్షించాలని భావించారు సీఎం జగన్. ఆస్పత్రులకు పంపే ముందు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ తో ఆయన పరీక్ష చేయించుకున్నారు. ఇందులో పది నిమిషాల్లోనే ఫలితం రావడంతో అధికారులు వాటిని రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు పంపించారు.

జగన్ కు కరోనా పరీక్ష..

ఆంద్రప్రదేశ్ లో కరోనా బాధితులను పరీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం కొరియా నుంచి అత్యాధునిక ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ లను తెప్పించింది. ఇవాళ క్యాంపు కార్యాలయంలో వీటిని ప్రారంభించిన సీఎం జగన్ .. అనంతరం తొలి పరీక్షను తానే చేయించుకున్నారు. వైద్యశాఖ అధికారులు ఆయనకు ప్రత్యేకంగా నిర్వహించిన ఈ పరీక్షలో పదినిమిషాల్లోనే ఫలితం వచ్చింది. జగన్ కు నెగెటివ్ గా తేలడంతో అధికారుల ఊపిరి పీల్చుకున్నారు.

cm jagan tests negative in covid 19 diagnosis with korian rapid testing kit

కొరియన్ కిట్లపై ఏపీ సర్కార్ ఆసక్తి..

దక్షిణ కొరియా నుంచి తెప్పించిన అత్యాధునిక కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై ఏపీ సర్కార్ ఎంతో ఆశాభావంగా ఉంది. వీటి ద్వారా రాష్ట్రంలో కరోనా పరీక్షల వేగం అమాంతం పెరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం పది నిమిషాల్లోనే ఫలితాలు వచ్చేలా వీటిని రూపొందించిట్లు చెబుతోంది. రేపటి కల్లా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వీటిని చేరవేయడం ద్వారా పరీక్షల వేగాన్ని రెట్టింపు చేయనున్నారు.

English summary
andhra pradesh chief minister ys jagan mohan reddy have been tested negative in covid 19 test with korian rapid testing kit. after importing the korian testing kits officials conducted test to cm jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X