ఎన్నికల వేళ కుప్పం కేంద్రంగా సీఎం జగన్ కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రతిపక్షాలు సీఎం జగన్ ను ఓడించటమే లక్ష్యంగా పొత్తులు, వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. సీఎం జగన్ తన సంక్షేమం, సామాజిక న్యాయం గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాల పైన ఫోకస్ చేసారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్.. వై నాట్ కుప్పం అంటూ ఇప్పుడు చంద్రబాబు అడ్డా లో అడుగు పెడుతున్నారు. కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు.

కుప్పంలో జగన్ : ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో గెలుపు పైన తొలి నుంచి ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు. అక్కడ ఇంఛార్జ్ గా బీసీ నేత భరత్ ను నియమించారు. ఎమ్మెల్సీ హోదా కల్పించారు. నియోజవర్గంలో ప్రభుత్వ పరంగా సంక్షేమం, ఇంటి స్థలాలు, గడప గడపకు ప్రభుత్వం చేరేలా ప్రణాళికా బద్దంగా వ్యవహరించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పంను రెవిన్యూ డివిజన్ గా చేయలేదని..తమ ప్రభుత్వానికి రెవిన్యూ డివిజన్ గా మార్చాలని లేఖ రాసిన విషయాన్ని పలు సందర్భాల్లో జగన్ గుర్తు చేసారు. కుప్పంను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించారు.

CM Jagan to announce key decisions in his Kuppam visit on 26th of this month

కృష్ణా జలాల క్రెడిట్ : కుప్పం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అటు చంద్రబాబు సైతం గతం కంటే భిన్నంగా ప్రతీ మూడు నెలలకోసారి కుప్పంలో మూడు రోజులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే కుప్పం కేంద్రం గా పలు నిర్ణయాలు ప్రకటించిన జగన్ ఈ నెల 26న కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ హంద్రీనీవా నీటిని కుప్పం నియోజకవర్గానికి అందించనున్నారు. కుప్పంకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చిన క్రెడిట్ వైసీపీదేనని చెబుతున్నారు. కుప్పంలో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తరువాత నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికలకు సంసిద్దత పైన జగన్ స్వయంగా సమీక్షించనున్నారు.

CM Jagan to announce key decisions in his Kuppam visit on 26th of this month

కీలక సమీక్ష : ఎన్నికల వేళ నియోజకవర్గాల వారీగా సీఎం జగన్ నేరుగా సమీక్షల నిర్వహణకు నిర్ణయించారు. కుప్పం నుంచే తొలి సమీక్షతో వీటినికి ప్రారంభించనున్నారు. తమ తొలి గెలుపు కుప్పంతోనే ప్రారంభం కావాలని ఇప్పటికే పార్టీ నేతలకు జగన్ నిర్దేశించారు. కుప్పం, మంగళగిరితో పాటుగా పవన్ పోటీ చేసే అవకాశం ఉన్న భీమవరం పైన ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేస్తున్నారు. కుప్పంలో గెలవాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఈ సమీక్ష సమయంలో కుప్పం ప్రజలను ఆకట్టుకొనే విధంగా అవసరమైన నిర్ణయాలకు అమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో..ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటన పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+