ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ కీలక అడుగు..!!

ఈ నెల 31న ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కు హాజరు కానున్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వేదికగా కీలక అడుగు వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మార్చి నెల 2,3 తేదీల్లో విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ నిర్వహణకు నిర్ణయించింది. ఈ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జాతీయ-అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను ఇందుకోసం ఆహ్వానించింది. పలు దేశాల్లో - నగరాల్లో ఈ సమిట్ పైన ప్రచారాలు చేస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ కు సంబంధించి ఢిల్లీలో ఈ నెల 31వ తేదీన కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అటు పాలనా పరంగా..ఇటు రాజకీయంగా విశాఖ సమ్మిట్ ను సక్సెస్ చేసందుకు ఢిల్లీ కేంద్రంగా కీలక అడుగులు వేస్తున్నారు. అదే రోజు ప్రధానితోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్

విశాఖలో మార్చి 2,3 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సమ్మిట్ కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ సమీక్షలు నిర్వహించారు. ప్రత్యేకంగా మంత్రులు- అధికారులతో టీం ను ఏర్పాటు చేసారు. ఈ సదస్సుకు జాతీయ - అంతర్జాతీయంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. దాదాపు 2500 మంది ప్రతినిధులు హాజరవుతారని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర భవిష్యత్ మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ లో శంకుస్థాపనలు, అగ్రిమెంట్ లు, ప్రారంభోత్సవాలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఏరో స్పేస్ డిఫెన్స్., గ్రీన్ ఎనర్జీ,. టెక్స్ టైల్, టూరిజం, అగ్రికల్చర్,ఫార్మా, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఈ సదస్సులో ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఢిల్లీ వేదికగా సీఎం జగన్ ప్రజెంటేషన్

ఢిల్లీ వేదికగా సీఎం జగన్ ప్రజెంటేషన్


విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 31న ఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని హోటల్ లీలా ప్యాలెస్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు, ఈ సమావేశంలో సీఎం జగన్ ఏపీలో పెట్టుబడి అవకాశాలు.. ప్రభుత్వ పరిశ్రమల పాలసీ..ఏపీలో పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యతలను వివరించారు. ఇదే సమయంలో.. రాష్ట్రంలో ఏపీకి ఉన్న సుదీర్ఘ సముద్రతీరం..రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పోర్టులు..కనెక్టివిటీ గురించి వివరించనున్నారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మానవ వనరుల లభ్యతను పారిశ్రామిక వేత్తల ముందు ఆవిష్కరిస్తారని అధికారులు వెల్లడించారు. ఏపీకి రావాలని..పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఈ వేదిక ద్వారా ఆహ్వానించనున్నారు. 2019 నుంచి 2022వరకు సగటున ఏడాదికి పెట్టుబడులు రూ. 15,693 కోట్లు వచ్చాయని వెల్లడించారు.

రాజకీయంగానూ ఈ టూర్ కు ప్రాధాన్యత..

రాజకీయంగానూ ఈ టూర్ కు ప్రాధాన్యత..


ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశంతో పాటుగా రాజకీయంగానూ 31న ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి అదే రోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాలకు ముందే ప్రధానితో భేటీ అవుతారని సమాచారం. ఎన్నికల ఏడాది కావటంలో పోలవరంకు పెండింగ్ నిధులతో పాటుగా అడహక్ నిదుల విడుదల పైనా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా ఏపీలో కొత్త పాత్తులు..మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా - పాలనా పరంగా కీలకంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+