మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ - రేపే పంపిణీ..!!
ఏపీలో ఎన్నికల రాజకీయ వేడెక్కుతోంది. ప్రతిపక్షాలపైన పూర్తిగా పై చేయి సాధించేలా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి మార్చి ఎన్నికల వరకు పూర్తి స్థాయి రోడ్ మ్యాస్ సీఎం జగన్ పార్టీ శ్రేణులకు ఫిక్స్ చేసారు. తన నవరత్నాల హామీ అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 12న ముఖ్యమంత్రి జగన్ ఒకే రోజు అయిదు లక్షల ఇళ్లను ప్రారంభించినున్నారు. మహిళా లబ్దిదారులకు అందించనున్నారు.
సామర్లకోటలో సీఎం పర్యటన:ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 12న సామర్లకోటలో పర్యటించనున్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంగా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ..అందులో 21.31 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 5 లక్షల 24 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పూర్తయిన ఇళ్లను రేపటి నుంచి (గురువారం) పేదలకు అందించనున్నారు. సామర్లకోటలో ప్రారంభించే ఈ గృహప్రవేశం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. సామర్లకోటలో నిర్మించిన 2,412 ఇళ్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో 5 లక్షల 24 వేల ఇళ్లను లబ్దిదారులకు అందించనున్నారు.

5 లక్షల ఇళ్ల గృహప్రవేశం:రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో పండుగ వాతావరణంలో ఇళ్ల పంపిణీ కార్యాక్రమం నిర్వహణకు నిర్ణయించారు. ఒకే సమయంలో అన్ని జిల్లాల్లో ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్లను అదించటం ద్వారా దాదాపు రూ 15 లక్షల విలువైన ఇంటికి మహిళలను యజమానులుగా చేస్తున్నారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం 21.31 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా మిగిలిన వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. రేపు జరిగే కార్యక్రమంలో విజయనగరంలో జిల్లాలో అత్యథికంగా 36,128 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 31,855 మందికి ఇంటి పత్రాలు అందించనునున్నారు. మొత్తం 26 జిల్లాల్లోనూ లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నారు.
సంక్షేమ ఓట్ బ్యాంక్ బలోపేతం:ఇక, మిగిలిన లబ్దిదారులకు కేటాయించిన ఇంటి నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. పేదలందరికీ ఇళ్లు పథంలో అధికంగా బీసీ వర్గాలకు 54 శాతం ఇళ్లు కేటాయించారు. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 6 శాతం, ఇతరలక 21 శాతం మేర ఇళ్లను కేటాయింపులు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే 12,500 కోట్లకు పైగా లబ్దిదారుల ఖాతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సొమ్మును జమ చేసారు. మిగిలిన ఇళ్లను కూడా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తన సంక్షేమ ఓట్ బ్యాంక్ మరింత బలోపేతం దిశగా సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications