పార్టీ నేతలకు సీఎం జగన్ పిలుపు - కీలక మంత్రాంగం..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తో కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో సానుభూతి కలిసి వస్తుందని టీడీపీ(TDP) అంచనా వేస్తోంది. అసలు సానుభూతి లేదనేది వైసీపీ నేతల లెక్క. ఈ సమయంలోనే టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ కలిసి రావాలని పవన్(Pawan Kalyan) పిలుపునిచ్చారు. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో సీఎం జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. కీలక సమావేశానికి నిర్ణయించారు.
పార్టీ నేతలతో సమావేశం:ముఖ్యమంత్రి జగన్ పార్టీ సమన్వయకర్తలు..ముఖ్యనేతలు...ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ప్రస్తుత అసెంబ్లీ(Asembly) సమావేశాలు ఈ నెల 27తో ముగియనున్నాయి. ఈ సమయంలోనే కీలక సమావేశానికి నిర్ణయించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతీ ఇంటికి ఎమ్మెల్యేలు వెళ్లి...వారికి అందుతున్న పథకాలను సమీక్షించారు. వారితో మమేకం అయ్యారు.

జగనన్న సురక్ష ద్వారా ప్రతీ ఇంటికి వెళ్లి అపథకాలకు అర్హత ఉండి అందని లబ్దిదారులను గుర్తించారు. వారిని పథకాల్లో అర్హలుగా చేర్చారు. ఇక, వచ్చే నెల నుంచి ముఖ్యమంత్రి జగన్(CM Jagan) ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ వై నీడ్స్ జగన్ అనే పథకాన్ని అమలు చేయనున్నారు. దీంతో పాటుగా ఎన్నికలకు పార్టీని సిద్దం చేసేందుకు జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సర్వే నివేదికలతో సిద్దం:ఇక..ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేలను...పార్టీ యంత్రంగాన్ని ప్రజల్లోకి పంపాలని సీఎం భావిస్తున్నారు. అదే సమయంలో గతంలో గడప గపడకు ప్రభుత్వం వర్క్ షాపులో సర్వే నివేదికల్లో వెనుకంజలో ఉన్న ఎమ్మెల్యేల(YSRCP MLAs)కు చివరి హెచ్చరిక చేసారు. తాను తిరిగి అందరూ పోటీ చేయాలని కోరుకుంటున్నానని..కానీ, ప్రజల్లో గుర్తింపు లేకపోతే మాత్రం సీటు ఇవ్వలేనని తేల్చి చెప్పారు.
వారి సేవలను పార్టీ మరో విధంగా వినియోగించుకుంటుందని స్పష్టం చేసారు. ఇప్పుడు తిరిగి ఎమ్మెల్యేల సర్వే నివేదికలు(Surevey Reports) సిద్దం అయ్యాయి. ఈ సారి నివేదికలే ఎమ్మెల్యేల అభ్యర్ధిత్వం ఖరారు చేయటంలో కీలకంగా మారే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. దీని పైన ఈ సమావేశంలో సీఎం జగన్(CM Jagan) స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

దిశా నిర్దేశం:ప్రస్తుత అసెంబ్లీ(Assembly) సమావేశాలు ముగిసిన తరువాత ఇక ఎమ్మెల్యేలను ప్రజల్లోనే ఉండేలా సీఎం మార్గదర్శకం చేయనున్నారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనల్లో భాగంగా పథకాల సమీక్ష..పాలనా వ్యవహారాలతో పాటుగా పార్టీ అంశాలపైన నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దసరా నుంచి విశాఖలో పాలన ప్రారంభించటం ఖాయమైంది. వారంలో రెండు రోజులు విశాఖ(Vizag) నుంచే సీఎం జగన్(CM Jagan) పాలన సాగించనున్నారు. అదే విధంగా జిల్లాల యాత్రలు...
ఎమ్మెల్యేల పనితీరు..సర్వే నివేదికలతో పాటుగా ఎన్నికల వేళ ప్రత్యర్ది పార్టీల పొత్తులకు ధీటుగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనేది ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో, ఈ సమావేశంలో టికెట్ల ఖరారుపై సీఎం ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications