ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక అడుగు..!!

ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. చెబితే చేస్తారనే నమ్మకం నిలబెట్టుకుంటున్నారు. దశాబ్దాల సమస్యగా ఉన్న ఉద్దానం లో కొత్త మార్పులు తీసుకొచ్చారు. నాడు చంద్రబాబు - పవన్ హామీ ఇచ్చి అమలు చేయలేదు. ఇప్పుడు జగన్ ఉద్దానంలో అసలు కిడ్నీ సమస్యలకు కారణాలకు పరిష్కారం చూపుతున్నారు. ఈ పర్యటన రాజకీయంగా జగన్ కు మైలేజ్ పెంచనుంది.

ఉద్దానంకు సీఎం జగన్ : ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ రేపు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప‌ర్య‌టించ‌నున్నారు. డాక్టర్ వైయ‌స్ఆర్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభలో ముఖ్య‌మంత్రి ప్ర‌సంగిస్తారు. ఉద్దానం ప్రాంత ప్రజలను గత మూడున్నర దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. గత టిడిపి ప్రభుత్వ కాలంలో వ్యాధి మరింత ప్రబళి కిడ్నీ వ్యాధి ఉధ్ధానం ప్రజల్ని కబళిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. ఈ లోగా వ్యాధి మరింత తీవ్రమైంది. ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్ ను కలిసి ఉద్దానం ప్రాంత ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

CM Jagan to inaugurate water scheme for kidney patients in Uddanam region on December 14

దశాబ్దాల సమస్య పరిష్కారం : నాడు ఇచ్చిన హామీ మేరకు 2015 లో ఆస్పత్రి..మంచినీటి పథకానికి శంకుస్థాపన చేసారు. ఇప్పుడు ప్రారంభోత్సవానికి వస్తున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం మకరాంపురం చేరుకుంటారు, అక్కడ డాక్టర్ వైయ‌స్ఆర్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు, ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు,హీరమండలం జలాశయం నుండి 1.12 టీఎంసీల నీటి సరఫరాతో, 1000 కిలోమీటర్ల పైపు లైన్ల నిర్మాణంతో, 264 వాటర్ సర్వీసు రిజర్వాయర్ల ద్వారా వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాలతో పాటు మేలియాపుట్టి, పాతపట్నం ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి 100 లీటర్ల చొప్పున రక్షిత మంచినీటిని కుళాయిల ద్వారా అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేసారు.

CM Jagan to inaugurate water scheme for kidney patients in Uddanam region on December 14

కీలక నిర్ణయాలు : దీని ద్వారా ఉద్దానం ప్రాంతంలో 807 గ్రామాల్లో 7,82,000 మందికి నిరంతరాయంగా రోజుకు 22 గంటల పాటు రక్షిత మంచినీటిని 2051 సంవత్సరం వరకు సరఫరా చేసేందుకు వీలయ్యేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. అంతేకాక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 'వంశధార వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్' తన అవార్డును ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరమండలం ఎత్తిపోతల పథకంలో కూడ 0.712 టీఎంసీల నీటిని ఉద్దానం తాగునీటి పధకానికి కేటాయించారు. ఇక, అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. జగన్ ప్రసంగం పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+