8న రైతుల ఖాతాల్లో సీఎం జగన్ నిధుల విడుదల..!!

ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. పథకాల అమలుకు వ్యూహాత్మకంగా జిల్లాలను ఎంపిక చేస్తున్నారు. ఈ నెల 8న వైఎస్సార్ జన్మదినం. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఆ రోజున రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కడప జిల్లా పర్యటనకు ముందు సీఎం జగన్ అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పర్యటించనున్నారు. అక్కడ రైతులకు ఇన పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయనున్నారు.

జూలై 8న రైతు దినోత్సవం : ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో సాయం చేయాలని గతంలోనే సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా రైతులను ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నారు. ఈ ఏడాది జూలై 8న ఉమ్మడి అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో సీఎం జగన్ ఈ సారి నిధులను విడుదల చేయనున్నారు.

farmerinputsubsidyamounts

వైఎస్సార్ జన్మదినం నాడు ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మంత్రి ఉసా శ్రీచరణ్ పర్యవేక్షించారు. సీఎం జగన్‌ రైతు పక్షపాతి అని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే సొంత‌మని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల : ఆర్బీకేల ద్వారా విత్త‌నం నుంచి విక్ర‌యం వ‌ర‌కు రైతుల‌కు అన్ని విధాలుగా తోడుగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిలుస్తోంద‌ని చెప్పారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారని, ఆర్బీకేల ద్వారా విత్త‌నం నుంచి విక్ర‌యం వ‌ర‌కు రైతుల‌కు అన్ని విధాలుగా తోడుగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిలుస్తోంద‌ని చెప్పారు.

jagan12

వైఎస్సార్ రైతు భరోసా, రైతులకు సున్నా వడ్డీ పథకం ద్వారా అండగా నిలిచామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ సరిగ్గా ఇవ్వలేదని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిశాయని, సీమ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ బాగా పెరిగిందని అన్నారు. కల్యాణ దుర్గంలో జరిగే రైతు దినోత్సవం కార్యక్రమం తరువాత సీఎం జగన్ కడప వెళ్లనున్నారు.

సీఎం కడప జిల్లా పర్యటన : మధ్యాహ్నం 1.30 గంటలకు కళ్యాణదుర్గం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా వైఎస్సార్ ఘాట్ కు చేరుకొని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయలోని ప్రార్థన మందిరానికి వెళతారు. అక్కడ సింహాద్రిపురం మండల నాయకులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు అక్కడి నుంచి ఇడుపులపాయలోని ఇంటికి వెళ్లనున్నారు. పదో తేదీ వరకు ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లాలోనే పర్యటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+