ఎవడు గురువు.. ఎవడికి గురువు.. చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్న సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు విషయంలో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో శిష్యుడు కోసం గురువు టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికలలో ఎవరు పోటీచేయకుండా నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు శిష్యుడు గురువు కోసం ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేవంత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎవడు గురువు .. ఎవడికి గురువు అంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తాను చంద్రబాబుకు సహచరుడినని పేర్కొన్నారు. ఎవరైనా బుద్ధిలేని వెధవ గురువు శిష్యుడు అంటే వాడిని తన్నడం పక్కా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తాను ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్లానని, తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు కాబట్టి పార్టీ అధినేతగా ఆయనకు నేను అపారమైన గౌరవాన్ని ఇస్తానని పేర్కొన్నారు.

ఏపీలో షర్మిలను ముఖ్యమంత్రిని చెయ్యాలి
చంద్రబాబుకు తాను సహచరుడినని మరోమారు నొక్కి చెప్పారు రేవంత్ రెడ్డి. ఏపీలో చంద్రబాబుకి మీరు సహకారం అందిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఉన్నారని, ఆమెను ముఖ్యమంత్రిని చేయాలని వైజాగ్ వెళ్లి ప్రచారం చేసి వచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిల ను కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ నిర్ణయిస్తే ముఖ్యమంత్రి చేయడానికి నేను పనిచేస్తానన్నారు.
రేవంత్ చంద్రబాబులపై వైసీపీ విమర్శలు
వేరే పార్టీల కోసం పని చేయాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సహకారం అందిస్తున్నారని వైసిపి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇటీవల ఓటుకు నోటు కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జూలై 24వ తేదీకి వాయిదా పడటంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టిడిపిని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబు కుమ్మక్కు అయ్యారన్నారు.
వైసీపీ వ్యాఖ్యలకు చెక్.. చంద్రబాబుకు షాక్
పదేపదే రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకటేనని, రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు, చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసిపి నేతలు. ఇక ఆ వ్యాఖ్యలకు చెక్ పెడుతూ తాజాగా రేవంత్ రెడ్డి తనకు ఎవడు గురువు లేడని, చంద్రబాబు, తాను సహచరులమని, తనకు చంద్రబాబు పట్ల అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications