కొత్త మంత్రులకు శాఖలు, సీతక్కకు ప్రమోషన్ - మార్పులు..!!

తెలంగాణ మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురు మంత్రులు చేరారు. వారికి శాఖల కేటాయింపు పైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి పార్టీ అధినాయకత్వంతో శాఖల కేటాయింపుతో పాటుగా.. మార్పులు - చేర్పుల గురించి చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా.. టీపీసీసీ కార్యవర్గం.. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవు ల విషయం పైన చర్చించనున్నారు. ఇక.. ప్రస్తుత మంత్రుల్లో సీతక్కకు ప్రమోషన్ ఖాయమని పార్టీ వర్గాల సమాచారం.

శాఖల కేటాయింపు
తెలంగాణ కేబినెట్ లో ముగ్గురు కొత్త మంత్రులతో పాటుగా మరి కొందరు శాఖల మార్పుల పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలనే కొత్తవారికి ఇచ్చే చాన్స్‌ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఎవరికీ కేటాయించని శాఖలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయి. వాటిలో విద్య, పురపాలక, హోం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్‌, కమర్షి యల్‌ ట్యాక్స్‌, పశు సంవర్థకశాఖ, న్యాయ, కార్మిక, మైన్స్‌ అండ్‌ జియాలజీ, క్రీడలు యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. కాగా, కొత్త మంత్రుల్లో గడ్డం వివేక్‌కు కార్మిక, మైనింగ్‌, క్రీడల శాఖ ఇస్తారని తెలుస్తోంది. అదే విధంగా, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం ఖరారైనట్లు సమాచారం.

cm-revanth-to-finalise-port-folios-for-new-ministers-today

హైకమాండ్ తో చర్చలు
మరో మంత్రి వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖ కేటాయించే అవకాశం ఉందని సమాచారం. సీఎం రేవంత్‌ రెడ్డి తొలిదశ మంత్రివర్గ కూర్పు సమయంలో శాఖల కేటాయింపుపై హైకమాండ్‌ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని శాఖల పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అధినాయకత్వంతో కీలక అంశాల పైన చర్చ చేయనున్నారు. పార్టీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలియవచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి సంబంధించి సభల తేదీలను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో మంత్రి పదవులు రాని వారి విషయం లోనూ మరోసారి రేవంత్ పార్టీ నాయకత్వంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సీతక్కకు ప్రమోషన్
పూర్తి స్థాయి మంత్రివర్గ ప్రక్షాళన దిశగా తొలుత కసరత్తు జరిగింది. ఒకరిద్దరు మంత్రుల తొలిగింపు పైనా చర్చలు చేసారు. అయితే, ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. స్థానిక సంస్థల ఎన్నిక లకు సిద్దం అవుతుండటంతో ముందుగా ముగ్గురికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎస్సీ- బీసీ వర్గాలకే అవకాశం కల్పించారు. ఇక, సీఎం వద్ద ఉన్న శాఖల్లో హోం శాఖను సీతక్క కు కేటాయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా.. విద్యా శాఖ రేవంత్ వద్దే కొనసాగనుంది. మున్సిపల్ శాఖను విభజన చేయనున్నారు. మిగిలిన మూడు మంత్రుల ఖాళీలు భర్తీ తరువాత పూర్తి స్థాయిలో శాఖల మార్పు పైన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఎస్టీ వర్గాని కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రానికి శాఖల కేటాయింపుపైన అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+