లీడర్, నాకు కొండంత అండ - వైఎస్ కు సీఎం జగన్, షర్మిల నివాళి..!!
వైఎస్సార్ వర్దంతి నేడు. ఇడుపులపాయలో సీఎం జగన్, కుమార్తె వైఎస్ షర్మిలతో సహా విజయమ్మ..కుటుంబ సభ్యులు నివాళఇ అర్పించారు. శుక్రవారం రాత్రి ఇడుపులపాయ చేరుకున్న షర్మిల ఈ ఉదయం తల్లి విజయమ్మతో కలిసి తండ్రి వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో షర్మిల పాల్గొన్నారు. షర్మిల తన భవిష్యత్ రాజకీయాలపైన ప్రకటన చేస్తారని భావించినా ఇది సరైన సమయం కాదని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ తన తండ్రికి ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తన తండ్రిని స్మరిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేసారు. "నాన్నా... మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా.." అంటూ నివాళి అర్పించారు.

అంతకు ముందు ఇడుపులపాయ వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులు మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు సతీమణి సునీత నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో సతీమణి భారతితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. తమ ఇద్దరు కుమార్తెలు లండన్ లో ఉండటంతో వారి వద్దకు వెళ్తున్నారు. ఈ నెల 11వ తేదీ రాత్రి తిరిగి తాడేపల్లకి చేరుకోన్నారు. ఎన్నికల సమయం కావటంతో, కుటుంబంతో పాటుగా లండన్ పర్యటనకు ముందుగానే వెళ్లాలని నిర్ణయించారు. ఇవ్వాల్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ బ్రతికే ఉన్నారని షర్మిల పేర్కొన్నారు.
నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి… pic.twitter.com/Fq1Ngg4f5Q
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2023
అటు, షర్మిల రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ లో తన పార్టీ విలీనానికి చర్చలు పూర్తి చేసారు. రాహుల్ గాంధీ సమక్షంలో తన పార్టీని షర్మిల విలీనం చేస్తారని సమాచారం. అయితే, తెలంగాణ రాజకీయాలకే పరిమితం కావాలని షర్మిల నిర్ణయించారు. సోనియా నుంచి షర్మిల రాజకీయ భవిష్యత్ కు హామీ దక్కిందని సమాచారం. దీంతో, త్వరలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ తో విలీనం చేయటంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ నుంచి తెలంగాణలోనే పోటీ చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications