Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఎమ్మెల్యేకు వైఎస్ జగన్ ఫోన్ కాల్..!!

పాలకొండ శాసనసభ్యురాలు విశ్వసరాయి కళావతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాను ఉన్నానంటూ ధైర్యాన్ని ఇచ్చారు.

పార్వతిపురం మన్యం: పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు విశ్వసరాయి కళావతి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. వారం రోజుల వ్యవధిలో అనారోగ్యానికి గురి కావడం ఇది రెండోసారి. దీనితో డాక్టర్లు ఆమెకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోన్నారు.

కొద్దిరోజులుగా విశ్వసరాయి కళావతి- గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటోన్నారు. ప్రతి గ్రామాన్నీ పలకరిస్తోన్నారు. తన నియోజకవర్గం పరిధిలోని ఓటర్లను స్వయంగా కలుసుకుంటోన్నారు. వారి క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకుంటోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.

 CM YS Jagan phone call to Palakonda MLA Viswasarayi Kalavathi, who is suffer with illness

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వతేదీన దోనుబాయిలో పర్యటిస్తోన్న సందర్భంగా కళావతి అస్వస్థతకు గురయ్యారు. దీనితో తన స్వగ్రామం వండవకు వెళ్లారు. నాలుగు రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత మళ్లీ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. నీరసంగా అనిపించడం వల్ల అనుచరులు వెంటనే ఆమెను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్‌ అయ్యారు. కనీసం నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించారు. డాక్లర్ల సలహా మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోన్నారు. ఈ విషయం తెలియడంతో వైఎస్ జగన్ స్పందించారు. కళావతికి ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చేసుకోవాల‌ని సూచించారు. ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.

జిల్లా రాజకీయాలపై కళావతికి గట్టి పట్టు ఉంది. పాలకొండ నుంచి వరుసగా రెండుసార్లు ఆమె ఘన విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై పైచేయి సాధించారు. 2014లో 1,600కు పైగా ఓట్ల తేడాతో నెగ్గినప్పటికీ- 2019కి ఈ సంఖ్య భారీగా పెరిగింది. తిరుగులేని మెజారిటీతో ఆమె జయకృష్ణను ఓడించారు. 18,000 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే పేరుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+