NEET 2026: నీట్ అభ్యర్ధులకు ఆర్టీసీ గుడ్ న్యూస్-ఉచిత బస్సులు, హెల్ప్ డెస్క్ లు..!

జాతీయ స్ధాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ (NEET UG 2026) పేపర్ లీక్ కావడంతో దాన్ని రద్దు చేసిన ఎన్టీఏ ఈ నెల 21న మరోసారి పరీక్ష నిర్వహణకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో నీట్ రీటెస్ట్ కు హాజరవుతున్న అభ్యర్ధులకు తమ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ మార్గదర్శకాలతో ఓ ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలో ఈసారి నీట్ పరీక్ష రాసే అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రత్యేక బస్సుల ఏర్పాటు, అభ్యర్ధులకు పరీక్ష రోజు ఉచిత ప్రయాణ సౌకర్యం, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకుంది. నీట్ పరీక్ష రాసే అభ్యర్ధులు తమ హాల్ టికెట్ ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. పరీక్షకు వెళ్లేటప్పుడు, అలాగే తిరిగి వచ్చేటప్పుడు కూడా ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు. నీట్ అభ్యర్ధులకు ఉచిత ప్రయాణం కోసం ఆర్టీసీ ఐదు రకాల సర్వీసుల్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఇందులో ఎక్స్ ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులు కూడా ఉన్నాయి.

APSRTC Goes Free for NEET UG 2026 Retest Students on June 21 Here s How to Avail It


ఈ మేరకు నీట్ అభ్యర్ధులకు ప్రయాణాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆర్టీసీ అధికారులు కింది స్దాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల సర్వీసుల్ని ఆ రోజు సకాలంలో నడిపేలా, ఎట్టి పరిస్ధితుల్లో సర్వీసులు రద్దు కాకుండా కూడా ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో పలు చోట్ల నీట్ అభ్యర్ధుల రద్దీ దృష్ట్యా జూన్ 21న అదనపు బస్సులు కూడా నడపాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్రధాన బస్టాండ్లలో హెల్ప్ డెస్క్ లు కూడా ఏర్పాటు చేసి అభ్యర్ధులకు అవసరమైన బస్సుల సమాచారం అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+