బర్త్ డే వేళ సీఎం విజయ్ బిగ్ సర్ ప్రైజ్..? విజయ్ పేరెంట్స్ వద్దకు సంగీత..!

తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ దళపతి- సంగీత సోమలింగం విడాకుల వ్యవహారం అటు సినీ ఇండస్ట్రీతోపాటు ఇటు తమిళనాట రాజకీయాల్లోనూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వీరి విడాకుల వివాదం ప్రస్తుతం చెన్నైలోని చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే సోమవారం జరిగిన విచారణకు అటు విజయ్ కానీ.. ఇటు సంగీత కానీ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. దాంతో విచారణను ఆగస్టు 7 కు ఫ్యామిలీ కోర్టు వాయిదా వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా తాము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అవుతామని వారు కోరారు. కానీ కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. అలాగే ఇరువురి అధికారిక ఈమెయిల్ ఐడీలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. ఇక ఇప్పటికే వీరి విడాకుల వ్యవహారం పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.

అయితే విజయ్- సంగీతల మధ్య రాజీ కుదిరినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇరువురు తిరిగి తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లండన్ నుంచి చెన్నై చేరుకున్న సంగీత.. ప్రస్తుతం విజయ్ తల్లిదండ్రలతోనే ఉందని సమాచారం అందుతోంది. విజయ్- సంగీతల మధ్య రాజీ కుదర్చడంలో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కీలకపాత్ర పోషించారని టాక్ వినిపిస్తోంది. అయితే జూన్ 22 న విజయ్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో ఆ శుభ సందర్భంగా విజయ్- సంగీత కలవబోతున్నట్లు తమిళ మీడియా నుంచి కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కథనాలపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

CMVijay Birthday on June 22 Sangeetha Visit Rumours Spark Hope to End Divorce Speculation CMVijay

ఇక తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి- సంగీతలకు 1999లో వివాహం జరిగింది. వారికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు దశాబ్ధాలకుపైగా సాఫీగా సాగిన వీరి కాపురం 2026లో విడాకులకు దారి తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ తనదైన శైలిలో తమిళనాడులో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. సీఎంగా తన మార్క్ పరిపాలన చూపిస్తున్నారు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తమిళనాడు అభివృద్దే తొలి ప్రాధాన్యతగా సాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+