అనంతలో బీజేపీ ఓటమి వెనుక, అసలు కారణం- ఢిల్లీ రిపోర్ట్..!!

ఏపీలో మున్సిపల్ ఫలితాల పై బీజేపీ అధినాయకత్వం ఆరా తీసింది. కూటమి ఏకపక్షంగా గెలుపు తో పాటుగా ఎన్నికల సరళి పైనా నివేదిక తెప్పించుకుంది. పలు మార్గాల్లో వచ్చిన సమాచారం మొత్తం క్రోడీకరించింది. అయితే, కూటమి పోటీ చేసిన అన్ని కార్పోరేషన్లలో అనంతపురం మినహా విజయం సాధించింది. బీజేపీకి అనంత కార్పోరేషన్ కేటాయించారు. ఏరి కోరి తీసుకున్న సీటులో ఓటమి పైన పార్టీ నాయకత్వం ఫోకస్ చేసింది. అసలు కారణాలు ఏంటో తెలుసుకుంది. పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు.

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి మూడు మున్సిపాల్టీలు, ఒక కార్పోరేషన్ మినహా అన్నింటా విజయం సాధించింది. అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ ను బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ నేతలు పట్టుబట్టి ఈ సీటు సాధించారు. ఈ సీటులో పోటీ కోసం బీజేపీ ముఖ్య నేతలు తమ వారి కోసం చివరి వరకు లాబీయింగ్ చేసారు. ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. దీంతో, బీజేపీ అధినాయకత్వం ఈ ఫలితం పైన ఆరా తీసినట్లు సమాచారం. కూటమిలో కొనసాగుతూనే పార్టీ బలోపేతం దిశగా సూచనలు చేస్తున్నా పట్టించుకోవటం లేదంటూ రాష్ట్ర నాయకత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటే పార్టీ ఎలా బలపడు తుందని ప్రశ్నించినట్లు తెలిసింది. మేయర్‌ సీటు అడిగే ముందు అక్కడ బలమైన అభ్యర్థిని చూసుకోవాల్సిన బాధ్యత లేదాని నిలదీసినట్లు సమాచారం. మంత్రి సత్యకుమార్‌ తన సన్నిహితు డైన సందిరెడ్డి శ్రీనివాస్‌ను బరిలో దించాలనే ఆలోచనతో అనంతపురంపై పార్టీలో చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో తన సతీమణి సోదరుడి కోసం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాధవ్‌ ప్రయత్నాలు చేసినట్లు పార్టీ నాయకత్వానికి సమాచారం అందింది.

ఎవరీ వైఎస్ అనిల్ రెడ్డి - సీఎంలతో సహా బిగ్ షాట్స్ అంతా అక్కడే, తెర వెనుక..!!
ఎవరీ వైఎస్ అనిల్ రెడ్డి - సీఎంలతో సహా బిగ్ షాట్స్ అంతా అక్కడే, తెర వెనుక..!!
bjp-leadership-seeks-report-on-party-s-defeat-in-anantapur-municipal-corporation-here-the-report

ఎన్నికల తరువాత పూర్తి స్థాయి సమీక్ష

ఇదే విషయం పైన ఢిల్లీ నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే.. అనంత మేయర్ పదవి బీసీ లకు రిజర్వ్ అయింది. దీంతో.. సందిరెడ్డికి అవకాశం లభించలేదు. అదే సమయంలో... పార్టీ అధ్యక్షుడి బంధువుకు టికెట్‌ రాకుండా మరో వర్గం రంగంలోకి దిగి సక్సెస్ అయింది. ఫైనల్ గా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు మరో సన్నిహితుడైన అజేశ్‌ యాదవ్‌కు టికెట్‌ ఇచ్చారు. డివిజన్లలో కూటమి అభ్యర్థులు భారీగా గెలిచినా, మేయర్‌ అభ్యర్థి మాత్రం గెలవలేకపోయారు. కూటమిలోని రెండు పార్టీల ముఖ్య నేతల నుంచి తగిన సహకారం లభించలేదని, వారి మధ్య ఉన్న గ్రూపులు తమ కొంప ముంచాయని బీజేపీ నేతలు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థి ఎంపికలోనే అసలు లోపం ఉందని మరో వర్గం నేతలు వాదిస్తున్నారు. అభ్యర్ధికి పార్టీ కేడర్ నుంచి సహకారం అందలేదని అధినాయకత్వం తేల్చింది. దీంతో.. ఇప్పుడు మొత్తం ఎన్నికల తరువాత హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫలితాల పైన సమీక్ష చేస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+