జనవరి 5వ తేదీ వరకు డెడ్ లైన్ పెట్టిన వైఎస్ జగన్..!!
అమరావతి: దేశంలో అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ బీఎఫ్ 7 వేరియంట్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన నలుగురికి కోవిడ్ వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మహమ్మారి మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో- కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. పలు నిర్ణయాలను తీసుకుంది. మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఆక్సిజన్ సహా..
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోవిడ్ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా వల్ల సంభవించే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు సహా అన్నిరకాల మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని అన్నారు. బెడ్స్, పీపీఈ కిట్స్, ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలేటర్స్.. ఇవన్నీ ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.

5వ తేదీ నాటికి
జనవరి 5వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ డెడ్ లైన్ విధించారు వైఎస్ జగన్. ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాలపైనా తనిఖీలు చేపట్టాలని ఆయన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్ల భర్తీ ప్రక్రియలో వేగం పెంచాలని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణం తదితర అంశాలపైనా జగన్ ఈ సమీక్షా సమావేశంలో ఆరా తీశారు.

ట్రయల్ రన్..
ఏపీలో ఇప్పటివరకు బీఎప్ 7 వేరియంట్ ఎక్కడా నమోదు కాలేదని అధికారులు వివరించారు. కోవిడ్ చికిత్స విషయంలో విలేజ్ క్లినిక్‌లను యూనిట్‌గా తీసుకోవాలని జగన్ సూచించారు. దీనికి అనుగుణంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను రూపొందించాలని అన్నారు. ఏఎన్‌ఏం, ఆశా వర్కర్లు విలేజ్ క్లినిక్‌ల కేంద్రంగా అందుబాటులో ఉండాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్వవేక్షణలో ఇవి పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో..
ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాలపైనా తనిఖీలు చేపట్టాలని వైఎస్ జగన్ ఆదేశించారు. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కెపాసిటీపై జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజుకు 60,000 ఆర్టీపీసీఆర్ టెస్టింగులను ఇదివరకు నిర్వహించామని, ఇప్పుడు ఆ సంఖ్య 30,000గా ఉందని తెలిపారు. విజయవాడలో జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ ను కూడా అందుబాటులో ఉందని అన్నారు. 13 చోట్ల టెస్టింగ్ ల్యాబ్స్, సిబ్బంది అందుబాటులో ఉన్నారని అధికారులు తెలిపారు.

విమానాశ్రయాల్లో..
అన్ని విమానాశ్రయాల్లోనూ అంతర్జాతీయ ప్రయాణికులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కోవిడ్ లక్షణాలున్న వారిని తక్షణమే విలేజ్ క్లినిక్స్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు రిఫర్ చేసేలా వ్యవస్థను రూపొందించుకోవాలని జగన్ ఆదేశించారు. 320 టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఎన్- 95 మాస్కులు, కోవిడ్ పీపీఈ కిట్స్ మరిన్ని అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications