గుడ్ న్యూస్: ఏపీలో ఆ సంక్షేమ పథకం నిధుల విడుదల

కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాల్లో ఒకటి- జగనన్న చేదోడు. ఇప్పటికే నాలుగు విడతలుగా ఈ పథకం కింద ప్రభుత్వం లబ్దిదారులకు నిధులను విడుదల చేస్తూ వచ్చింది.

మరోసారి ఈ పథకం కింద నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. దీని కోసం వైఎస్ జగన్.. ఈ నెల 19వ తేదీన అంటే- గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు 10,000 రూపాయల చొప్పున బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

 CM YS Jagan to disburse funds under Jagananna Chedodu scheme on Oct 19

ఉదయం 8:30 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం బయలుదేరుతారు వైఎస్ జగన్. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయనకు కర్నూలు, నంద్యాల లోక్‌సభ సభ్యులు, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు స్వాగతం పలకనున్నారు.

ఉమ్మడి జిల్లాల నాయకులు, అధ్యక్షులు జగన్‌ను కలుసుకోనున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో ఎమ్మిగనూరుకు వెళ్తారు వైఎస్ జగన్. వీవర్స్‌ కాలనీలో గల వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్లొంటారు. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+