Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం - 1.10 కోట్ల ఓట్లపై గురి, గేమ్ ఛేంజర్..!!

ఏపీలో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. ఎన్నికల వేళ వరుసగా సంక్షేమ పథకాల అమలుకు జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెలలో పెన్షన్ రూ 3వేలకు పెంచిన ముఖ్యమంత్రి..ఇదే నెలలో 78.94 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఆసరా నాలుగో విడత నిధులు విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు. వచ్చే నెలలో వైఎ్ససార్ చేయూత నిధులు విడుదల చేయనున్నారు.

వరుస పథకాలతో: ఎన్నికల ముందు సీఎం జగన్ కీలకమైన రెండు సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 23న ఆసరా నాలుగో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు. సీఎం జగన్ ఉరవకొండ నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు. మూడు విడతలుగా ఇప్పటి వరకు రూ 19,195 కోట్లు పంపిణీ చేసారు.

CM YS Jagan to Release YSR Asara fourth Phase funds on 23rd January for 78.94 beneficiaries

చివరి విడతగా నాలుగో విడత కింద రూ 6,400 కోట్లు విడుదల కానుంది. దీని ద్వారా 78.94 లక్షల మందికి లబ్ది చేకూరనుంది, ఈ నెల 23వ తేదీ నుచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. నాలుగో విడత నిధుల విడుదల ద్వారా ఆసరా పథకం కింద మొత్తంగా రూ 25,570 కోట్లు మహిళలకు అందించినట్లవుతుంది.

కోటి పది లక్షల మంది ఖాతాల్లో: వచ్చే నెల ఫిబ్రవరిలో మరో పథకం అమలుకు నిర్ణయించారు. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్‌ చేయూత కార్యక్రమం జరగనుంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు విడుదల చేసారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలబడ్డమే కాకుండా, వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.

45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు చొప్పున పంపిణీ చేసారు. 26 లక్షల మందికి పైగా లబ్దిదారులు ఉన్నారు. మహిళల్లో సుస్థర జీవనోపాథి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశంగా సీఎం జగన్ స్పష్టం చేసారు.ఇందులో భాగంగానే అనేక మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలతో టై అప్‌ చేయించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేలా నిర్ణయాలు అమలు చేస్తున్నారు.

CM YS Jagan to Release YSR Asara fourth Phase funds on 23rd January for 78.94 beneficiaries

గేమ్ ఛేంజర్: ఫిబ్రవరి 20వ తేదీ తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పథకాల అమలు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సంక్షేమం అమలు చేస్తూనే పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలను వివరించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి జగన్ పార్టీ కేడర్ తో జోనల్ మీటింగ్స్ నిర్వహణకు నిర్ణయించారు.

ఆ తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన..ఇక ప్రచారం ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లొ పూర్తి జాబితాను ప్రకటించి..ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల యుద్దంలోకి దిగాలని భావిస్తున్నారు. భారీ స్థాయిలో సంక్షేమ పథకాల అమలు ద్వారా ఎన్నికల వేళ గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. వైసీపీ లెక్కలు ఎంత వరకు ఫలిస్తామనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+