బాబుతో బాలకృష్ణ: బాధితులకు పరామర్శ(పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో ఐదు లక్షల ఎకరాల్లో కాఫీ తోటలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి గిరిజనులు లక్షాధికారులుగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన పాడేరు డివిజన్‌లోని వివిధ గ్రామాల్లో తుఫాను బారిన పడి నష్టపోయిన బాధితులను పరామర్శించారు. పాడేరు చింతలవీధి హెలిపాడ్, శ్రీకృష్ణాపురం ప్రభుత్వ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల, డి. గొందూరు, లాడపుట్టు, కరకపుట్టు, ఇరడాపల్లి, మత్స్యగడ్డ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల్లో ఎక్కడెక్కడో ఉంటున్న వారందరూ సురక్షిత ప్రాంతాలకు రావాలని చంద్రబాబు గిరిజనులను కోరారు. అందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. గిరిజనులు కొండలు వీడి సురక్షిత ప్రాంతాల్లో వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కాఫీ తోటల పెంపకంప జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

చంద్రబాబు
విశాఖ ఏజెన్సీలో ఐదు లక్షల ఎకరాల్లో కాఫీ తోటలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి గిరిజనులు లక్షాధికారులుగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

చంద్రబాబు
శుక్రవారం మధ్యాహ్నం ఆయన పాడేరు డివిజన్‌లోని వివిధ గ్రామాల్లో తుఫాను బారిన పడి నష్టపోయిన బాధితులను పరామర్శించారు.

చంద్రబాబు
పాడేరు చింతలవీధి హెలిపాడ్, శ్రీకృష్ణాపురం ప్రభుత్వ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల, డి. గొందూరు, లాడపుట్టు, కరకపుట్టు, ఇరడాపల్లి, మత్స్యగడ్డ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.

చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల్లో ఎక్కడెక్కడో ఉంటున్న వారందరూ సురక్షిత ప్రాంతాలకు రావాలని చంద్రబాబు గిరిజనులను కోరారు.

చంద్రబాబు
గిరిజనులు కొండలు వీడి సురక్షిత ప్రాంతాల్లో వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కాఫీ తోటల పెంపకంప జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

బాబుకు విరాళం
హాస్పిరా ఫార్మా కంపెనీ 60 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.

బాబుతో బాలకృష్ణ
తుఫాను బాధితుల సహాయార్థం 30 లక్షల రూపాయల చెక్కు, 15 లక్షల రూపాయల విలువైన వస్తువులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బాలకృష్ణ శుక్రవారం విశాఖలో అందచేశారు.

బాబుతో బాలకృష్ణ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ కూడా బాధితులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.
ఇరడాపల్లిలో భూమి కోతకు గురైన ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించారు. డి. గొందూరు గ్రామంలో తుఫాను తాకిడి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. దెబ్బతిన్న మత్స్యగడ్డ వంతెనను సందర్శించారు. వెంటనే వంతెనను పునరుద్దరించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావంతో ఎందరో నష్టపోయారని, ప్రతి ఒక్కరికీ తగినవిధంగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇది ఇలా ఉండగా పోలీస్ ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం సమావేశమయ్యారు. డీజీపీ రాయుడు, ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.
చంద్రబాబుకు రూ. 30లక్షల చెక్కును అందించిన బాలకృష్ణ
నాన్న బాటలోనే తుఫాను బాధితులకు సాయం చేస్తామని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తుఫాను బాధితుల సహాయార్థం 30 లక్షల రూపాయల చెక్కు, 15 లక్షల రూపాయల విలువైన వస్తువులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బాలకృష్ణ శుక్రవారం విశాఖలో అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ కూడా బాధితులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.












Click it and Unblock the Notifications