ఆ వెదవలకు ఇదే సమాధానం, నేనేదో థర్టీ అంటూ బతుకుతున్నా: చంద్రబాబుపై కమెడియన్ పృథ్వీ

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వీఆర్ కాలేజీ మైదానంలో జరిగిన వైసీపీ వంచన దీక్షలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు గాంచిన ప్రముఖ కమేడియన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేపదే తనకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడిపై తనదైశన శైలిలో చురకలు వేశారు.

Recommended Video

    మరో చరిత్ర సృష్టించనున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర

    ఏపీ సీఎం చంద్రబాబు తనపై ఉన్న ఓటుకు నోటు కేసు సహా పలు కేసుల భయంతోనే నవ్యాంధ్రకు తరలి వచ్చారన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు పేరును ఉచ్చరించడానికి కూడా తనకు ఇష్టం లేదన్నారు. ఆయన పేరు చెప్పడానికి కూడా తన నోటి నుంచి రావడం లేదన్నారు.

    నేనేదో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే, ఆయన ఫార్టీ అంటారు

    నేనేదో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే, ఆయన ఫార్టీ అంటారు

    నేను ఏదో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమాలో బతుకుతున్నానని పృథ్వీరాజ్ చెప్పారు. కానీ ఆయన (చంద్రబాబు) వచ్చి తాను పరిశ్రమలో నలభై ఏళ్లు అంటాడని ఎద్దేవా చేశారు. నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నలభై ఏళ్ల వయస్సున్న మా జగన్ అన్నను చూసి ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.

     అవ్వను జగన్ అలా గౌరవించారు

    అవ్వను జగన్ అలా గౌరవించారు

    కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో జగన్ యాత్రలో జనసంధోహానికి, జన సముద్రానికి వైబ్రేషన్స్ వచ్చాయని చెబితే ఒకాయన (టీడీ) గ్రాఫిక్స్ అన్నారని, వాళ్లకు 2019లో ఓట్ల రూపంలో సమాధానం చెప్పాలని నటుడు పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు. రోహిణీ కార్తె వంటి ఎండల్లో జగన్ నడుస్తున్నారన్నారు. వృద్ధులు, మహిళలు కూడా ఆయన యాత్రకు వస్తున్నారన్నారు. ఓ 82 ఏళ్ల ఆవిడ వచ్చి జగన్‌ను కలిసిందని, జగన్ ఆమె కాళ్లు పట్టుకొని చెప్పులు తొడిగి ఆ అవ్వను గౌరవించారన్నారు.

    ఆ వెధవలకు ఇదే సమాధానం

    ఆ వెధవలకు ఇదే సమాధానం

    జగన్‌కు పెద్దల పట్ల గౌరవం లేదనే వెధవలకు ఇదే సరైన సమాధానం అని పృథ్వీరాజ్ అన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే సామాన్యుడు కూడా మాట్లాడవచ్చని, సామాన్యుడు కూడా మిమ్మల్ని నిలదీయవచ్చునని అన్నారు. నేను అల్లాటప్పాగా రాలేదన్నారు. నేను ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ చేశానన్నారు. నేను కార్యకర్తగా కూడా ఓ అజెండా పెట్టుకున్నానని చెప్పారు. నృత్య రూపకం, నాటకం తయారు చేశామని, త్వరలో ప్రతి మండలానికి వెళ్లి ప్రదర్శనలు నిర్వహిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నాటకం రూపంలో చెబుతామన్నారు.

    జగన్‌తో కలిసి నడిచిన పృథ్వీ

    జగన్‌తో కలిసి నడిచిన పృథ్వీ

    కాగా, పృథ్వీరాజ్ నాలుగైదు రోజుల క్రితం జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయనతో కలిసి నడిచారు. అప్పుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. మండుటెండలను సైతం లెక్కచేయకుండా జనం జగన్ యాత్రకు పోటెత్తుతున్నారని చెప్పారు. పేదల కష్టాలు తెలిసిన వాడే నిజమైన నాయకుడు అన్నారు. నేను చూసిన గొప్ప సీఎంలు ఎన్టీఆర్, వైయస్సార్‌లు అన్నారు. మడమతిప్పని యోధులు అన్నారు. కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ వారధి ఊగిపోయిందంటే ఏ స్థాయిలో జనాధరణ ఉందో అర్థమవుతోందన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+