పాపం, జగన్ కష్టం ఎవరూ తీర్చలేరు: వేణుమాధవ్ సెటైర్, బాబుపై బెంగతో సచివాలయానికి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే తనకు జాలి వేస్తోందని ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ అన్నారు.

Jagan Padayatra : Heavy Crowd In Jagan's Public Meet At Yerraguntla | Oneindia Telugu

అదే నిజమైతే 'భారతి' మాటేమిటి: పాదయాత్ర, జగన్‌కు దిమ్మతిరిగే ప్రశ్నలు!

 సచివాలయానికి వేణు మాధ్

సచివాలయానికి వేణు మాధ్

వేణుమాధవ్ గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. సచివాలయానికి ఎందుకు వచ్చారని విలేకరులు ప్రశ్నించారు.

 చంద్రబాబును చూసి చాలా రోజులైంది, బెంగ వచ్చింది

చంద్రబాబును చూసి చాలా రోజులైంది, బెంగ వచ్చింది

ఏం లేదని, మామూలుగానే వచ్చానని, ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి చాలా రోజులు అయిందని, బెంగ వచ్చిందని, అందుకే కలిసి మాట్లాడి, వెళ్లిపోతున్నానని వేణుమాధవ్ చెప్పారు.

 జగన్ కష్టం ఎవరూ తీర్చలేరు

జగన్ కష్టం ఎవరూ తీర్చలేరు

ఈ సందర్భంగా జగన్ గురించి మాట్లాడారు. జగన్‌ను చూస్తే చాలా జాలి వేస్తోందని వేణుమాధవ్ అన్నారు. పాపం ఐదు రోజులు యాత్ర, మళ్లీ అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు, మళ్లీ యాత్ర.. ఆయన కష్టం ఎవరూ తీర్చలేరని ఎద్దేవా చేశారు.

 వేణుమాధవ్

వేణుమాధవ్

ఇదిలా ఉండగా, వేణుమాధవ్ టీడీపీ అభిమాని. ఆయన ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. నంద్యాల ప్రచారం కోసం తనకు డబ్బులు ఇచ్చారని, విపక్షాలు విమర్శించగా, వాటిని కొట్టి పారేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tollywood comedian Venu Madhav has met Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu in Velagapudi secreteriate on Thursday.
Please Wait while comments are loading...