విద్యుత్ ఉద్యోగుల పంపకాల వివాదం .. ముగిసిన కమిటీ విచారణ .. వారంలోగా నివేదిక
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ ఉద్యోగుల పంపకాల వివాదం మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ సంస్థల ఉద్యోగుల పంపకాల వివాదంపై గత రెండు రోజులుగా విచారణ జరిపిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ వారం రోజుల్లో తమ నివేదికను సుప్రీంకోర్టుకు, రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వనుంది.

రెండు రోజుల పాటు విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై విచారణ
రెండు రోజుల పాటు హైదరాబాద్లో రెండు రాష్ట్రాల్లోని విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులతో జస్టిస్ ధర్మాధికారి కమిటీ విచారణ జరిపింది. ఏపీ దక్షిణ డిస్కం సీఎండీ హరినాథ్, జె యం డి చక్రధర బాబు, తెలంగాణ జెన్కో సంచాలకుడు అశోక్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు సైతం ఈ విచారణకు హాజరయ్యారు. ఉద్యోగుల పంపకాల విషయంలో ఎవరి వాదనలు వారు వినిపించారు.

ఏపీ స్థానికత కలిగిన వారిని రిలీవ్ చేసిన తెలంగాణా .. విధుల్లో చేర్చుకోని ఏపీ
తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత ఏపీ స్థానికత కలిగిన 1157 మందిని 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థ నుండి రిలీవ్ చేసి ఏపీకి పంపించారు. అయితే వారిని ఏపీ లో చేర్చుకోవడానికి అక్కడి అధికారులు నిరాకరించారు. దీంతో ఈ వివాదాన్ని తేల్చడానికి ధర్మాధికారి తో ఏకసభ్య కమిటీని సుప్రీం కోర్టు నియమించింది.

కమిటీ ముందు తెలంగాణా విద్యుత్ సంస్థల ప్రతిపాదనలు
ఈ 1157లో 613 మంది ఏపీలోనే చేరతామని ఆప్షన్ ఇచ్చినందున వారిని అక్కడ చేర్చుకుంటే మిగిలిన వారిని తెలంగాణలో తిరిగి చేర్చుకోవడానికి అభ్యంతరం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆదివారం రాతపూర్వకంగా తెలిపాయి. ఈ 1157 మంది కాకుండా ఏపీలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 256 మంది తెలంగాణకు వెళతామని ఆప్షన్ ఇచ్చినందున వారిలో సగం మందిని కూడా తీసుకుంటామని తెలంగాణా విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి.

తిరస్కరించిన ఏపీ .. ముగిసిన విచారణ
కానీ 613 మందిని ఏపీలో చేర్చుకుంటేనే తాము మిగతా వారిని తీసుకుంటామని తెలంగాణ విద్యుత్ సంస్థలు షరతు పెట్టాయి. ఇక తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలన్నింటినీ ఏపీ తిరస్కరించింది. దీంతో ఇక ఈ అంశంపై విచారణ ముగిసిందని, తుది నివేదికను సుప్రీంకోర్టుకు ఇస్తామని జస్టిస్ ధర్మాధికారి ప్రకటించారు. ఆయన ఇచ్చే తుది నివేదికలోని సిఫార్సులే సుప్రీంకోర్టు ఆదేశాలుగా త్వరలో వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

వారంలో తుది నివేదిక .. సర్వత్రా ఉత్కంఠ
ఇప్పటివరకు రెండు రాష్ట్రాల ఉద్యోగుల పంపకాల విషయంలో జాప్యం జరగడం వల్ల విద్యుత్ ఉద్యోగులకు నష్టం జరిగిందని ఉద్యోగులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది .ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులు ఆగిపోయాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం జస్టిస్ ధర్మాధికారికిచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. త్వరితగతిన ఈ వివాదాన్ని తేల్చాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని వారు ధర్మాధికారి కమిటీకి విన్నవించారు. మరి త్వరలో ఒక తుది నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో కమిటీ నివేదిక ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications