అమరావతి ఏర్పాట్ల పరిశీలన: మంత్రుతో 8 కమిటీల ఏర్పాటు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లకు, కార్యక్రమ నిర్వహణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో 8 కమిటీలను నియమించారు. స్వాగత కమిటీలో మంత్రులు గంటా శ్రీనివాస రావు, రావెల కిశోర్ బాబు, దేవినేని ఉమామహేశ్వర రావు, కామినేని శ్రీనివాస రావు ఉంటారు.
ఆతిధ్య కమిటీలో మహిళా మంత్రులు మృణాళిని, పరిటాల సునీత, పీతల సుజాత ఉన్నారు. రాష్ట్రస్థాయి ఉత్సవాల కమిటీలో మంత్రులు మాణిక్యాలరావు, అయ్యన్నపాత్రుడులు సభ్యులుగా ఉంటారు. మీడియా కమిటీలో సభ్యులుగా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యవహరిస్తారు.

రాజధాని వేదిక కమిటీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు, నిర్వహణ కమిటీ సభ్యులుగా యనమల రామకృష్ణుడు, నారాయణ, ఆహ్వాన కమిటీ సభ్యులుగా అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లను నియమించారు.
ప్రతి కమిటీలో సీఆర్‌డీఏ, మున్సిపల్, ప్రొటోకాల్ అధికారులు సహా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు చోటు కల్పించారు. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించారు. అనంతరం నిర్మాణ వేదికను మంత్రులు, అధికారులు పరిశీలించారు. బుధవారం రాజధాని శంకుస్థాపన వేదిక ఏర్పాట్లను హెలికాప్టరు ద్వారా సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications