ఉచిత ఇసుక దెబ్బ గతంలో వేలల్లో ఊడ్చేశారు, ఇప్పుడు ఫ్రీగా, నదులు, వాగులు, వంకల్లో క్యూ

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పేదలు, సామాన్య ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. కొత్తగా ఇళ్లను నిర్మిస్తున్న పేదలు ఉచిత ఇసుక కోసం ఇసుక స్టాక్ పాయింట్ల దగ్గరకు క్యూ కడుతున్నారు. ఇంతకాలం టన్ను ఇసుక కోసం వేలల్లో వసూలు చేసిన వైసీపీ నాయకుల మీద ప్రజలు మండిపడుతున్నారు.

రాయలసీమలో ఉచిత ఇసుక కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇసుక స్టాక్ పాయింట్ల దగ్గర క్యూకడుతున్నారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం మండలం జుంజురాంపల్లి స్టాక్ పాయింట్ లో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఉచిత ఇసుక అందిచే పథకాన్ని ప్రారంభించడంతో పేద ప్రజలు ఇసుకను తీసుకెలుతున్నారు.

Common people queuing near free sand stock points in Andhra Pradesh

శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి మండలం కుటాగుళ్లలోని స్టాక్ పాయింట్ దగ్గర బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి, స్టాక్ పాయింట్ దగ్గర ఉచిత ఇసుక పంపిణి మొదలైయ్యింది. ఇసుక అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేసిన ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇసుక అందివ్వడం సంతోషంగా ఉందని పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం ఇళ్ల నిర్మాణం పెండింగ్ లో పెట్టిన సామాన్య ప్రజలు ఇప్పుడు వాళ్ల ఇంటి పనులు ముమ్మరం చేస్తున్నారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఎక్కడా లేన విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. ఇసుక డిమాండ్ పెరగడం, విపరీతంగా ధరలు పెరిగిపోవడంతో సుమారు 40 రంగాల మీద దాని ప్రభావం పడింది. సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఇసుక డిమాండ్ కారణంగా తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని సామాన్య ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఆరోపణలు చేస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ప్రైవేట్ ఏజెన్సీల చేతికి వెళ్లిపోవడంతో టన్ను ఇసుకకు రూ. 390 నుంచి రూ. 670 వరకు వసూలు చేసి ఇసుకను విక్రయించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం టన్ను ఇసుక రూ. 195కు ఇవ్వడానికి నిర్ణయించడంతో మధ్య తరగతి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్ ల దగ్గర ఎలాంటి సమస్యలు లేకుండా పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి ఇసుక తీసుకు వెలుతున్నారు. ఇసుక స్టాక్ పాయింట్ల దగ్గరే కాకుండా ఉప నదులు, వాగులు, వంకల్లో ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్లు, ఎడ్ల బండ్ల మీద తీసుకెలుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+