వరద బాధితుల నుంచి పన్నుల వసూళ్లు..!!

విజయవాడ వరద నష్టం నుంచి స్థానికులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రభుత్వం వారికి ఆర్దికంగా అండగా ఉంటామని ప్రకటించింది. ప్రతీ ఇంటికి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది. విద్యుత్ బిల్లుల వసూళ్లు వాయిదా వేసింది. ఇదే సమయంలో విజయవాడ మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లు మొదలు పెట్టారు. పెనాల్టీలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

పన్నుల కోసం
వరదలతో విజయవాడ వాసులు కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం వారంతా కోలుకొనే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చింది. కానీ, విజయవాడ నగర పాలక సంస్థ తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. 15 రోజుల్లో ఇంటి పన్ను రద్దు చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద బాధితులకు ఇంటి పన్ను రద్దు చేయకపోగా, 15 రోజుల్లో చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని హెచ్చరించడం పైన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, వామపక్ష పార్టీల నేతలు ఈ నిర్ణయం పైన నిరసన వ్యక్తం చేసారు.

Communist leaders protest against tax Collections in Vijayawada flood Affected areas

పెనాల్టీలు విధిస్తాం
వరద ప్రాంతాల్లో 2024 -25 సంవత్సరం ఇంటి పన్ను, ఇతర చార్జీలు పూర్తిగా రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు డిమాండ్ చేశారు. ప్రజలు వరద కష్టాల్లో ఉంటే సెప్టెంబర్ 30వ తేదీలోగా విజయవాడ నగర ప్రజలు ఆస్తి పన్ను (ఇంటి పన్ను), మంచినీటి, డ్రైనేజీ చార్జీలు, ఖాళీ స్థలాలపై పన్నులు చెల్లించాలని, లేనియెడల పెనాల్టీలు పడతాయని నగరపాలక సంస్థ ఇప్పుడు ప్రకటన విడుదల చేయటం గర్హనీయమన్నారు. విజయవాడ నగరంలో 32 డివిజన్లలో 2,70,000 కుటుంబాలకు పైగా, దాదాపు 8 లక్షల జనాభా వరదల్లో నీట మునిగారు. సర్వస్వం కోల్పోయారు.

వామపక్షాల నిరసన
విజయవాడ నగర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యిందని తెలిపారు. ప్రభుత్వం వారిని అన్ని విధాల ఆదుకోవాల్సిన సమయం ఇదన్నారు. నగరపాలక సంస్థ బాధితులకు తోడ్పాటు ఇవ్వాల్సిన ఈ సమయంలో పన్నుల వసూళ్లలో మునిగితేలటం అన్యాయమన్నారు. బాధితులను ఆదుకోవడంలో విజయవాడ నగర పాలక సంస్థ పాలకపక్షం, ప్రజాప్రతినిధులు పూర్తిగా మొహం చాటేసారన్నారు. బాధ్యతను విస్మరించారని మండిపడ్డారు. 2024- 25 సంవత్సరానికి సంబంధించి వరద బాధిత ప్రాంతాలలో ఆస్తి పన్ను, మంచినీరు, డ్రైనేజీ, ఖాళీ స్థలాల పన్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+