జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - ఎవరి వైపు..కీలక మలుపు..!!
పార్లమెంట్ సాక్షిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. అవిశ్వాసం నోటీసులపై 119 మంది ఎంపీలు సంతకాలు చేశారు. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ ఎంపీలు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. అయితే ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు అవిశ్వాసం నోటీసులపై సంతకాలు చేసేందుకు ఒప్పుకోలేదు. ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరిం చింది. కాగా.. ఈ అంశంలో వైసీపీ మద్దతు ఎవరికి.. ఓటింగ్ వేళ ఎవరి వైపు నిలుస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తి కర పరిణామాలు తెర మీదకు వచ్చాయి. సభలో తాము మాట్లాడేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించడం లేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా 8 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. భారత్-చైనా ఉద్రిక్తతలకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ నరవణె అముద్రిత పుస్తకంలోని అంశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ఎంపీలు నిరసనలకు దిగి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తీరుపై ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి సిద్దమైంది. సాధారణంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఆ ప్రకారం బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో అవిశ్వాస తీర్మనం సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా, రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

ఓటింగ్ లో వైసీపీ ఎవరి వైపు
అయితే, మాజీ ప్రధానమంత్రులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. అయితే, ఇండియా కూటమి లోనే స్పీకర్ పైన అవిశ్వాసం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీఎంసీ భిన్నంగా స్పందించింది. రెండు నుంచి మూడు రోజుల్లో స్పందన రాకపోతే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి లోక్ సభ లో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేదు. కాంగ్రెస్ - బీజేపీ ఎంపీలు తమ పార్టీల వైఖరికి కట్టుబడి ఓటింగ్ లో పాల్గొంటారు. ఏపీలో టీడీపీ-బీజేపీ- జనసేన కూటమికి చెందిన 21 మంది ఎన్డీఏకు అనుకూలంగా నిలుస్తారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం కాంగ్రెస్ ప్రతిపాదనలకు మద్దతు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. మరి.. ఇప్పుడు జగన్ ఎవరి వైపు. ఉపరాష్ట్రపతి ఎన్నికల తరహాలో మరోసారి ఎన్డీఏ వైపే నిలుస్తారా... రాష్ట్రంలో నెలకున్న రాజకీయ పరిణామాలతో భిన్నమైన నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications