వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ మాయం- వైసీపీతోనే మా పోటీ- సోము వీర్రాజు కామెంట్స్‌

|
Google Oneindia TeluguNews

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించడంతో ఊపుమీదున్న ఏపీ బీజేపీ నేతలు అప్పుడే ప్రత్యర్ధులపై కామెంట్స్‌ మొదలుపెట్టేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అద్భుత విజయం అందుకున్న తెలంగాణ బీజేపీ నేతలకు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ అబినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యయానికి నాంది పలికిన ఓటరు మహాశయులకు పాదాభివందనం.కుటుంబ పాలనను కూకటివేళ్ళతో పెకలించే ప్రక్రియలో ఇది ఆరంభం మాత్రమే.వీరోచిత పోరాటంతో అద్భుత విజయం సాధించిన తెలంగాణ బీజేపీకి అభినందనలు అంటూ సోము ట్వీట్ చేశారు.

ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సోము వీర్రాజు ఏపీలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని జోస్యం చెప్పారు. దేశంలో బీజేపీ మినహా అన్ని పార్టీల్లో కుటుంబ పాలన ఉందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఏపీలోనూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌, టీడీపీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఏపీలో జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తామని సోము ధీమా వ్యక్తంచేశారు.

congress and tdp will disappear soon, our fight is with ysrcp : ap bjp chief somu veerraju

ఏపీలో టీడీపీ హయాంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన సోము.. ఏపీలో 7,200 కోట్లు తీసుకుని చంద్రబాబు.. 4 తాత్కాలిక బిల్డింగులు కట్టారని ఆరోపించారు. భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ కనుమరుగవుతాయని, జనసేన- బీజేపీ, వైసీపీ మధ్యే పోటీ' అని ఉంటుందని సోము పేర్కొన్నారు. టీడీపీ అదికారంలో ఉన్నప్పటి నుంచి ఇవే ఆరోపణలు చేస్తున్న సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలతో టీడీపీ విషయంలో బీజేపీ వైఖరి మరోసారి స్పష్టమైనట్లయింది.

English summary
after having surprising results in hyderabad coroporation elections, andhra pradesh bjp chief somu veerraju says that congress and tdp will disappear in the state and their fight will be with ruling ysrcp only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X